అషు రెడ్డి లగ్జరీ లైఫ్.. దానికి డబ్బులు ఎవరిస్తున్నారో రెడ్ హ్యాండెడ్‌గా బట్టబయలు!

యాక్ట్రెస్, టీవీ పర్సనాలిటీ అషు రెడ్డి మొన్నీమధ్య ఆర్జీవితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి సంచలనం అయ్యింది. అలాగే టీవీ ప్రోగ్రాంలో ద్వారా ప్రేక్షకులకు టచ్ లోనే ఉంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మ రీసెంట్ లైఫ్ స్టైల్ చాలా ఊహాగానాలకు తీస్తోంది. ఈ అమ్మడు అమెరికా, దుబాయ్, మాల్దీవులు వంటి ప్రాంతాలకు ఏదో ఒక ఊరికి వెళ్ళినట్టు వెళ్లి వస్తోంది. అక్కడ ఎంజాయ్ చేసి ఫొటోలు వీడియోలు పంచుకుంటోంది.

భారతదేశంలో మంచి టూరిస్ట్ డెస్టినేషన్లకు కూడా వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. మాల్దీవులు, థాయిలాండ్ వంటి ఇతర గమ్యస్థానాలకు తరచుగా ప్రయాణిస్తుంది. వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక్క ట్రావెల్ ప్లాన్ చేయాలన్నా కనీసం లక్షల్లో డబ్బులు ఉండాలి. ఈ ముద్దుగుమ్మ ఏమో మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాలలో కూడా నటించడం లేదు. అలాంటిది ఆమెకు ఇంత విలాసవంతమైన లైఫ్ స్టైల్ గడపడానికి ఎక్కడినుంచి డబ్బు వస్తున్నాయి? అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి అషు రెడ్డి బోల్డ్ ఇంటర్వ్యూలు చేయడమే కాదు బోర్డుగా స్కిన్ షో కూడా చేస్తోంది. అందాలన్నీ బయట పెడుతూ ఫోటోలను పోస్ట్ చేయడం ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్ పాపులర్ అవుతోంది. ఇప్పటివరకు ఈ హాట్ భామకు ఇన్‌స్టాగ్రామ్‌లో 20 లక్షల మంది ఫాలోవర్లు అయ్యారు. సాధారణంగా ఐదు లక్షల ఫాలోవర్లు ఉంటేనే కంపెనీలు తమ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయించుకునేందుకు ఎగబడుతుంటాయి. ఇక 20 లక్షల మంది ఫాలోవర్లు ఉంటే కంపెనీలో అధిక డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతుంటాయి. ఆ అవకాశాన్ని అషు రెడ్డి బాగా సద్వినియోగం చేసుకుంటోంది.

ఆమె పోస్ట్‌లపై అభిమానుల ఆసక్తిని, ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవడానికి అందాలను ఆరబోస్తూనే కంపెనీ ప్రమోషన్లను చేజిక్కించుకుంటుంది. ఆ కంపెనీల ప్రమోషన్ల ద్వారా వచ్చిన డబ్బులతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ జోష్ యాప్‌ను ప్రమోట్ చేసింది. గతంలో కూడా ఈ యాప్‌ను ప్రమోట్ చేసింది. అలాగే మరికొన్ని యాప్స్ గురించి పోస్టులు పెడుతూ డబ్బులు సంపాదించింది. ఇక ఈవెంట్స్ కు కూడా వెళ్తూ ఈ ముద్దుగుమ్మ రెండు చేతులా సంపాదిస్తుంది. అలా బహిరంగంగానే ఈ ముద్దుగుమ్మ తనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెబుతోంది.

Share post:

Latest