అరియనా చేతికి భయంకరమైన గాయం.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..??

 

అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్‌లో యాంకర్‌గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఎంతమంది సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసి బాగా పాపులర్ అయింది. ఇక ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ఆమె లైఫ్‌కి టర్నింగ్ పాయింట్ గా మారింది. ఈ ఇంటర్వ్యూ వల్ల కొన్ని విమర్శలను ఎదురుకున్నప్పటికీ ఓవర్ నైట్ స్టార్‌గా మారింది. దాంతో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా అవకాశం కూడా దక్కించుకుంది. బిగ్ బాస్ లో అరియాన ఆట తీరుకి చాలా మంది ఫిదా అయిపోయ్యారు.

బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరుగా నిలిచి తన రేంజ్ ని ఇంకాస్త పెంచుకుంది అరియానా. ఇక అప్పటినుంచి ఆమెకు బుల్లితెరపై అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇటీవలే మా టీవీ లో ప్రసారమయ్యే బిబి జోడి లో ముక్కు అవినాష్ తో కలిసి అరియనా అదిరిపోయే డాన్స్ స్టెప్పులు వేస్తుంది. ఇక ఈ క్రమంలో అరియనా గాయాల పాలయ్యింది. దానికి కారణం ముక్కు అవినాష్ అని అతనిపై విరుచుకు పడింది.

అరియనా చేతికి తగిలిన గాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది. మిస్టర్ అవినాష్ గారు చూడండి మీరూ డ్యాన్స్ పై తప్ప పక్కన వాళ్ళపై దృష్టి పెట్టకపోవడంతో గాయలపాలవ్వుతారు. చుడండి బిబి జోడిలో డ్యాన్స్ చేసే సమయం లో నాకు దెబ్బ తగిలి చెయ్యి మొత్తం కమిలిపోయింది. కాబట్టి నేను దీని తీవ్రంగా ఖండిస్తున్నాను అవినాష్ గారు అంటూ కాస్త ఫన్నీ గానే రియాక్ట్ అయింది. ఆ వీడియోకి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అరియనా తన కెరీర్ లో చాలా కష్టాలు పడింది అని కొంతమంది అంటుంటే మరికొంత మందేమో అరియానాకి దెబ్బతగిలేలా డ్యాన్స్ చేస్తవా అవినాశ్ అంటూ అవినాష్‌పై ఫైర్ అవుతున్నారు.

Share post:

Latest