బ్లాక్ లెహంగాలో మైండ్ బ్లాక్ చేసిన అనుప‌మ‌.. ఏం అందం రా బాబు!

మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. గత ఏడాది కార్తికేయ 2, 18 పేజెస్, బట‌ర్ ఫ్లై చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న ఈ అందాల సోయగం.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది.

అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ అదిరిపోయే ఫోటో షూట్లతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తోంది.

కెరీర్ ఆరంభం నుంచి ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ చాలా పద్ధతిగా కనిపించిన అనుపమ.. ఈమధ్య గ్లామర్ డోస్ బాగా పెంచేసింది.

తాజాగా బ్లాక్ కలర్ లెహంగాలో అందంగా దర్శనమిచ్చి అందరికీ మైండ్ బ్లాక్ చేసింది. నాజూకు నడుము అందాలు చూపిస్తూ హొయలు పోయింది.

కొంటెగా ఫోటోల‌కు ఫోజులు ఇస్తూ కుర్రాళ్ల‌ గుండెల్లో మంటలు రేపింది. అనుపమ తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ఓ రేంజ్ లో దూమారం రేపుతున్నాయి.

అనుప‌మ‌ను చూసి ఏం అందం రా బాబు అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మ‌రి లేటెందుకు అనుప‌మ తాజా ఫోటోల‌పై ఓ లుక్కేసేయండి.

Share post:

Latest