తప్పుడు పనులు చేశానని ఒప్పుకున్న యాంకర్ రష్మి.. నీ నిజస్వరూపం ఇదా??

 

బుల్లి తెర యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది రష్మి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అమ్మడుకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వెండితెరపై కూడా కొని సినిమాలో నటించింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో బుల్లి తెర యాంకర్ గానే కొనసాగుతుంది. రష్మీ ఒకవైపు యాంకర్ గా అల్లరిస్తూనే ఇంకోవైపు సోషల్ మీడియా లో గ్లామరస్ ఫొటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తూ ఉంటుంది.

అంతేకాకుండా మూగ జీవులకు సంబంధించిన విషయాలను చాలా సీరియస్ గా తీసుకుంటుంది. వాటిని రక్షించడానికి ఏమైనా చేయడానికి సిద్దపడుతుంది. అయితే జంతువుల విషయం లోనే కాకుండా సొసైటీలో జరుగుతున్నప్పుడు పనులపై కూడా స్పందించి వివాదాలలో పడుతుంది. బాధలో ఉన్నవారికి తన వంతు సహకారం అందిస్తూ ఉంటుంది.

తాజాగా రష్మీ మిల్క్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చెయ్యడం మానేస్తున్నాను అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్విట్ చదివిన కొంతమంది 2019లో రష్మీ ఓపెనింగ్ చేసిన ఐస్‌క్రీం షాప్ వీడియోలోని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి ‘ అసలు ఈ సెలెబ్రేటీలు అంతా ఇంతే, డబ్బు కోసం ఏమైనా చేస్తారు. అంతా అయిపోయాక ఇలాంటి ట్వీట్లు పెడతారు’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ నెగిటివ్ కామెంట్స్ పై స్పందించిన రష్మీ ‘ గతంలో నేను తప్పు చేసాను. దానికి కొన్నాళ్ల క్రితం నుంచి నేను పాలు తాగటం మానేశాను. పాలు తాగటం వల్ల చర్మవ్యాధులు రావడం నేను గమనించాను. దాంతో ఫ్యాక్టరీలో పాలు ఎలా ఉత్పత్తి అవుతాయనే దాని గురించి పూర్తిగా తెలుసుకొని వాటిని ప్రమోట్ చేయడం మానేశాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

 

Share post:

Latest