ఓటీటీ లో విడుదల కానున్న అమీగోస్..!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. డిఫరెంట్ చిత్రాలు విలక్షణమైన పాత్రలలో నటిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు క్రియేట్ చేసుకున్న ఈయన ఒకవైపు హీరోగా మరొకవైపు నిర్మాతగా పలు రకాలుగా బిజీ అయిపోతున్నారు. ఇకపోతే కళ్యాణ్ రామ్ ఇటీవల బింబి సారా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ టైం ట్రావెల్ నేపథ్యంతో ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో డ్యూయల్ రోల్ పోషించిన కళ్యాణ్ రామ్ తన నటనతో యువతను మరొకసారి ఆకర్షించాడు.

Amigos' trailer: Nandamuri Kalyan Ram's film promises to be a crazy roller  coaster ride; Jr NTR to attend the pre-release event | Telugu Movie News -  Times of India

సినిమా తర్వాత ఆయన నటించిన చిత్రం అమిగోస్.. ఇందులో త్రిపాత్రాభినయం చేశారు కళ్యాణ్ రామ్.. జై లవకుశ సినిమాలో త్రిపాత్రాభినయం చేసి ఈతరం హీరోలలో రికార్డు సృష్టించిన ఎన్టీఆర్ రికార్డును బ్రేక్ చేస్తూ.. ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేసి మెప్పించాడు. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 10వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయింది.. అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చినప్పటికీ కూడా ప్రేక్షకులను అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఓటీటీ లో కూడా అడుగుపెట్టబోతోంది ఈ సినిమా.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా ఓటిటి హక్కులను సొంతం చేసుకుంది. మార్చి 10వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ఈ సినిమా. ఇకపోతే విడుదలకు ముందే భారీ అంచనాలను పొందిన ఈ సినిమా.. టైటిల్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి సినిమాపై బజ్ భారీగా ఏర్పడింది. ముఖ్యంగా అమీగోస్ అంటే ఫ్రెండ్స్ అని అర్థం. ఒకేలా ఉండే ముగ్గురి కథతో ఈ సినిమా తెరకెక్కించారు. ఇకపోతే సినిమా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేని ఈ సినిమా ఓటీటీ లో ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.

Share post:

Latest