ఇట్స్ అఫీషియ‌ల్‌.. బ‌న్నీ నెక్స్ట్ ఆ హిట్‌ డైరెక్ట‌ర్ తో ఫిక్స్‌!

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప 2` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్‌ బ్లాక్ బస్టర్ హిట్‌ అవడంతో రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే సెకండ్ పార్ట్‌ను అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవలె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇకపోతే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్ తో ఉండబోతోందనే చర్చ ఎప్పటి నుంచో సాగుతుంది. అయితే తాజాగా బన్నీ సస్పెన్స్ కు తెర దించారు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు డైరెక్టర్ ను ఫిక్స్ చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ తనదైన మార్క్ చూపించిన సందీప్ రెడ్డి వంగా తో బ‌న్నీ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడు. శుక్రవారం ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

పాన్ ఇండియా స్థాయిలో బాలీవుడ్ అగ్ర‌ నిర్మాణ సంస్థ టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. భూషణ్ కుమార్‌, ప్రణయ్ వంగా ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. బన్నీ కెరీర్లో తెర‌కెక్క‌బోయే 23వ సినిమా ఇది. పుష్ప 2 పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్‌ మీదకి వెళ్ల‌నుంది. కాగా, ప్రస్తుతం సందీప్ రెడ్డి బాలీవుడ్ లో రణ‌బీర్ కపూర్ తో `యానిమల్` అనే సినిమా చేస్తున్నాడు. అలాగే ప్రభాస్ తో `స్పిరిట్` అనే మూవీని లైన్ లో పెట్టాడు.

Share post:

Latest