మరొకసారి అరుదైన రికార్డు సృష్టించిన అల్లు అర్జున్..!!

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి తన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో పెరిగిపోయింది. ఇక అభిమానులు మాత్రం అల్లు అర్జున్ ని కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన సినిమాల కంటెంట్ ఏదైనా ఆన్లైన్లో విడుదలయితే చాలు కచ్చితంగా అది అగ్రస్థానంలో ఉంటుందని చెప్పవచ్చు.

Allu Arjun's Car Collection Is Literally 'Fire', Owns Collection From 4  Crore's Range Rover Vogue To Jaguar XJ Costing 1.20 Crore
పోరుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగింది అల్లు అర్జున్ కు అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉండడం గమనార్హం. దాదాపుగా 20 మిలియన్ల మైలురాయని సాధించిన తొలి దక్షిణాది భారతీయ నటుడుగా రికార్డు సాధించారు అల్లు అర్జున్. అటు అల్లు అర్జున్ ఫ్యామిలీకి, ఇటు అభిమానులకు చాలా గౌరవిస్తూ ఉంటారు. వృత్తిపరంగా వ్యక్తిగతంగా కూడా సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే ఉంటారు అల్లు అర్జున్.

SSAA FAN CLUB on Twitter: "Icon Star @alluarjun becomes the first actor  from South to reach 20 Million followers on Instagram. This new milestone  is a testament to the love and admiration
ముఖ్యంగా తన కుటుంబం గురించి తన పిల్లల వీడియోల గురించి ఎప్పుడూ పోస్ట్ షేర్ చేస్తూ ఉంటాడు. దీంతో అల్లు అర్జున్ పెట్టే పోస్టింగ్ కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప -2 చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈ సినిమా విడుదల కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమాని కూడా అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు సుకుమార్..

Share post:

Latest