ఫస్ట్ టైమ్‌ భయపడిన అల్లు అరవింద్.. అందుకే వాటి జోలికి వెళ్లడం లేదు..??

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ బడా నిర్మాతలలో అల్లు అరవింద్ కూడా ఒకరు. అయితే ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలు తీస్తున్న నిర్మాతల జాబితాలో మాత్రం అల్లు అరవింద్ పేరు కనిపించడం లేదు. దానికి కారణం ఏంటనేది మాత్రం ఎవరికీ తెలీదు. చాలా రోజుల నుంచి అల్లు అరవింద్ ఎక్కువగా చిన్న సినిమాలనే నిర్మిస్తున్నాడు. నిజానికి చిన్న సినిమాల వల్ల రిస్క్ తక్కువ, లాభం ఎక్కువ అనే ఉద్దేశంతో అల్లు అరవింద్ ఈ విధంగా ముందుకు సాగుతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నారు.

అయితే అల్లు అరవింద్ లాంటి స్టార్ ప్రొడ్యూసరే పెద్ద సినిమాలను నిర్మించకుంటే, ఇంకెవరు నిర్మిస్తారంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు అల్లు అరవింద్ తలచుకుంటే వందల కోట్ల బడ్జెట్ ఖర్చు చేసి అద్భుతమైన సినిమాలను నిర్మించగలరు. కానీ ఆయనకు మాత్రం అలాంటి సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ సంవత్సరంలో మూడు, నాలుగు చిన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఈ తరుణంలో పెద్ద సినిమాలను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి.

అల్లు అరవింద్ ఫ్యామిలీలోనే స్టార్ హీరోలు ఉన్నారు. కనీసం వారితోనైనా భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించవచ్చు కదా అని కొంతమంది సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నారు. కాగా తాజాగా వీటికి అల్లు అరవింద్ సమాధానం చెప్తూ ‘వాళ్ళు వేరే ప్రొడ్యూసర్స్‌కి మాత్రమే డేట్స్ ఇస్తున్నారు, నాకు డేట్లు ఇవ్వడం లేదు’ అంటూ సరదాగా కామెంట్స్ చేశారు. అయితే చిరంజీవి, అల్లు అరవింద్ కాంబోలో ఒక సినిమా ను నిర్మించాలని మెగా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మరి ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. అంతేకాకుండా రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఒక మల్టీస్టారర్‌ని కూడా అల్లు అరవింద్ నిర్మించాలని భావిస్తున్నాడు. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Share post:

Latest