ప్రేమ పెళ్లి పై స్పందించిన అఖిల్.. షాక్ లో ఫ్యాన్స్..!!

ఏజెంట్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖిల్. ప్రస్తుతం సీసీఎల్ క్రికెట్ మోత మోగిస్తున్నారు సిసిఎల్ కోసం ప్రాక్టీస్ లో ఉన్న అఖిల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. అఖిల్ మాట్లాడుతూ వీళ్ళందరూ నాకు ప్లేయర్స్ గా కాకుండా ఫ్రెండ్స్ గా ఉంటారు. స్కూల్లో ఓపక్క క్లాసులు జరుగుతూ ఉంటే వెళ్లి క్రికెట్ ఆడే వాళ్ళము ఇలా చాలాసార్లు దొరికాము అంటూ తెలియజేశారు.. అఖిల్ క్రికెట్ ఆడే సమయంలో ఎన్నో కిటికీ అద్దాలు కూడా పగలగొట్టామని తెలిపారు.

Tollywood: Stressful birthday for Akhil Akkineni?
తనకు సోషల్ మీడియా ఎక్కువగా తెలియదని.. సోషల్ మీడియా అంటే కొంత భయం కూడా ఉందని అందుకే దాన్ని ఎక్కువగా వాడనని ఎక్కువగా పోస్టులు షేర్ చేయనని తెలిపారు. కేవలం నా సినిమాల గురించి మాత్రమే అప్డేట్ ఇస్తాను దానివల్ల అభిమానులు నన్ను మిస్ అవుతూ ఉంటారు అంటూ తెలిపారు. ఇక తన వివాహం గురించి రకరకాలుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. కానీ అందులో నిజం లేదు.. ఇప్పట్లో తనకు వివాహం చేసుకొని ఉద్దేశం లేదని తెలిపారు. నేను సింగల్ గానే ఉన్నాను.. మింగిల్ అయ్యే ఆలోచన అయితే ఇప్పట్లో లేదని తెలిపారు.

Why did Akhil Akkineni and Shriya Bhupal split? Some possible reasons -  Hindustan Times

తనకు లవ్ అంటే స్పోర్ట్స్ అంతే అని చెప్పుకొచ్చారు అఖిల్. అఖిల్ సినిమా విషయానికి వస్తే తాను హీరోగా నటించిన ఏజెంట్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇందులో హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తున్నది. ఈ సినిమాని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తూ ఉన్నారు. పెళ్లి ప్రేమ పైన చేసిన కామెంట్లకు అఖిల్ ఫ్యాన్స్ కాస్త ఆశ్చర్యపోతున్నారు. గతంలో ప్రేమ విఫలం వల్ల అఖిల్ ఇలా మాట్లాడుతున్నారని కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.

Share post:

Latest