ఆ హీరోను పిచ్చిగా ప్రేమించి మోస‌పోయా.. మీనా ఓపెన్ కామెంట్స్‌!

ప్ర‌ముఖ న‌టి మీనా ఇంట్లో గ‌త ఏడాది తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. మీనా భ‌ర్త విద్యా సాగర్ మృతి చెందారు. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. 2009లో మీనా, విద్యాసాగర్ వివాహం చేసుకున్నారు. వీరికి నైనిక అనే కుమార్తె కూడా ఉంది. నైనిక భ‌విష్య‌త్తు కోసం భ‌ర్త మ‌ర‌ణంతో కోలుకున్న మీనా.. మ‌ళ్లీ సినిమాల‌తో బిజీగా అయ్యారు.

 

త‌న వ‌య‌సుకు త‌గ్గా పాత్ర‌ల‌ను పోషిస్తూ స‌త్తా చాటుతున్నారు. అయితే గ‌తంలో మీనా ఓ స్టార్ హీరోను పిచ్చిగా ప్రేమించింద‌ట‌. కానీ, ఆ హీరో మ‌రొక‌రి అమ్మాయిని పెళ్లి చేసుకుని మీనా మ‌న‌సును ముక్క‌లు చేశారు. ఇంత‌కీ మీనా ప్రేమించిన ఆ హీరో మ‌రెవ‌రో కాదు.. అన‌తి కాలంలోనే బాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా ఎదిగిన హృతిక్ రోషన్.

ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో హృతిక్ రోషన్ ను గాఢంగా ప్రేమించానని మీనా స్వ‌యంగా వెల్ల‌డించింది. `నేను హృతిక్ రోషన్‌ను చాలా ప్రేమించాను. హృతిక్ లాంటి అబ్బాయి కావాలి అని మా అమ్మతో చెప్పాను. అయితే హృతిక్ పెళ్లి రోజు నా గుండె పగిలింది.` అంటూ మీనా చెప్పుకొచ్చింది. మొత్తానికి మీనా హృతిక్ ను ప్రేమించి చివ‌ర‌కు మోస‌పోయింది.

Share post:

Latest