డేంజర్ జోన్‌లో ఉత్తరాంధ్ర మంత్రులు..ఆ ఇద్దరు సేఫ్?

విశాఖ రాజధాని పేరుతో ఉత్తరాంధ్రలో బలమైన శక్తిగా ఎదగాలని వైసీపీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విశాఖకు రాజధాని వస్తుందని ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఈ రాజధాని కాన్సెప్ట్ తో ఉత్తరాంధ్రలో వైసీపీ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని చూస్తుంది. కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే ఆ పరిస్తితి కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ సత్తా చాటింది గాని ఈ సారి ఎన్నికల్లో ఇబ్బంది పడక తప్పదని తెలుస్తోంది.

ఈ సారి ఉత్తరాంధ్రలో వైసీపీకి ఎదురుదెబ్బలు తగిలేలా ఉన్నాయి. అలాగే ఈ ప్రాంత మంత్రులకు సైతం తిప్పలు తప్పవని తెలుస్తోంది. ఇప్పటికే నిదానంగా టి‌డి‌పి పుంజుకుంటుంది. అదే సమయంలో జనసేనతో పొత్తు ఉంటే వైసీపీ డేంజర్ జోన్ లోకి వెళ్ళినట్లే. ఇదే సమయంలో ఉత్తరాంధ్రలో ఉన్న వైసీపీ మంత్రులు డేంజర్ జోన్ లోకి వెళ్ళినట్లే అని తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖ జిల్లాల మంత్రులు.

శ్రీకాకుళం లో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు, అప్పలరాజు. శ్రీకాకుళం అసెంబ్లీలో ఉన్న ధర్మాన డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. టి‌డి‌పి-జనసేన కలిసొస్తే ఇక్కడ ధర్మానకు గెలుపు అసాధ్యమే. అటు పలాసలో ఉన్న మంత్రి అప్పలరాజు పరిస్తితి కూడా అంతే. ఆయనపై నెగిటివ్ ఎక్కువగా ఉంది.

ఇటు విశాఖలో అనకాపల్లి నుంచి ఉన్న మంత్రి అమర్నాథ్‌కు స్వతహాగానే ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. ఇంకా టి‌డి‌పి-జనసేన కలిస్తే ఈయనకు రిస్క్. మాడుగుల నుంచి బూడి ముత్యాలనాయుడు ఉన్నారు. ఈయన పరిస్తితి కూడా మెరుగ్గా లేదు. అయితే విజయనగరంలో ఉన్న ఇద్దరు మంత్రులు చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ, సాలూరు నుంచి రాజన్న దొర..ఈ ఇద్దరికి మళ్ళీ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.