మళ్లీ పోలీసులను ఆశ్రయించిన వీకే నరేష్.. ఈసారి..?

నటి పవిత్ర లోకేష్ తో తన బంధం గురించి ఎక్కువగా ఈ మధ్యకాలంలో ట్రోలింగ్ చేస్తున్న వారి పైన సినీ నటుడు నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొకసారి పోలీసులను ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు కూడా ఆయన అధికారులకు సమర్పించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నటి పవిత్రతో తనకున్న రిలేషన్షిప్ పైన సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ ఆగని నేపథ్యంలో మరొకసారి ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. గతంలో కూడా ఫిర్యాదు చేసిన దర్యాప్తు ఎక్కడ దాకా వచ్చిందనే విషయం తెలుసుకునేందుకు మరొకసారి సైబర్ క్రైమ్ ఆశ్రయించినట్లుగా సమాచారం.

Naresh and Pavitra Lokesh share a passionate kiss in wedding announcement  video. Watch - India Today

గత కొంతకాలంగా కావాలనే తమ పైన ఎవరో తప్పుడు పోస్టింగులు పెడుతున్నారని మళ్లీ నరేష్ ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించిన కొన్ని పోస్టులను సైతం సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లను పోలీసులకు సమర్పించినట్లు తెలుస్తోంది నరేష్. కొన్ని ఫోటోలు, వీడియోలు మార్పింగ్ చేసి అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారని సినీనటి పవిత్ర లోకేష్ గత ఏడాది నవంబర్ 27న సైబర్ క్రైమ్ కు ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. కొన్ని వెబ్సైట్లో యూట్యూబ్ ఛానల్స్ పనిగట్టుకొని మరి ఇలా చేస్తున్నారని ఫిర్యాదులో తెలియజేసినట్లు తెలుస్తోంది.

కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అడ్డం పెట్టుకొని తనను కించపరుస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఇక తన మాజీ భార్య రమ్య రఘుపతి హస్తం కూడా ఈ వీడియోలో పోస్టింగులు వెనుక హస్తము ఉందని తెలియజేశారు. ఇకపోతే డిసెంబర్ 31న తమ పెళ్లి గురించి ప్రకటించారు నరేష్, పవిత్ర లోకేష్. అందుకు సంబంధించి ఒక వీడియోని కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇద్దరూ లిప్ లాక్ పెట్టుకుంటూ ఉన్నటువంటి ఒక వీడియోను చూసిన నెట్టుజెన్స్ మళ్లీ ట్రోల్ చేయడం జరిగింది.

Share post:

Latest