ఆ టైటిట్స్‌తో సినిమా తీస్తే అట్ట‌ర్‌ప్లాపేనా… ఇంత‌క‌న్నా సాక్ష్యం కావాలా…!

తెలుగు చిత్ర పరిశ్రమలో గతంలో ఇంగ్లీష్ టైటిల్స్ తో వచ్చిన సినిమాలు అంచనాలకు మించి ఘనవిజయం సాధించాయి. అయితే ఇప్పుడు మాత్రం ఇంగ్లీష్ టైటిల్స్ తో వస్తున్న సినిమాలు ఎక్కువ శాతం ప్లాప్ సినిమాలు గా మిగిలిపోతున్నాయి. ఇప్పుడు ఇదే ఇష్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 10న‌ కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అమీగోస్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ సినిమాగా మిగిలింది.

Amigos First Report From US Premieres

మన తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ పెడితే సినిమాలు ఆడటం లేదనేది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వస్తున్నడం గమనార్హం. రీసెంట్గా సుధీర్ బాబు నటించిన హంట్‌ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. గత సంవత్సరం నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇలా ఇంగ్లీష్ టైటిల్స్ తో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎవరు ఊహించని విధంగా దారుణమైన డిజాస్టర్ లగా మిగిలిపోయాయి.

The Ghost Review, The Ghost Movie telugu Review, Nagarjuna Ghost Movie  Review

ఇంగ్లీష్ టైటిల్స్ తో వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం హిట్ అయిన మెజారిటీ సినిమాలు రిజల్ట్ చూస్తే ప్రేక్షకుల దగ్గర నుంచి ఆశించిన స్థాయిలో సక్సెస్‌ను దక్కించుకోలేకపోయాయి. ఇప్పటినుంచి అయినా టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఇంగ్లీష్ టైటిల్స్ కన్నా తెలుగు సినిమా పేర్లకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లో చేస్తున్నారు.

Hunt Movie Review: A dry crime drama with baffling intentions

ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దర్శకనిర్మాతలు ఈ కామెంట్లను పరిగణనలోకి తీసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకు క్రేజ్ పెరుగుతుండగా ఆ సినిమాలకు అయినా తెలుగు టైటిల్స్ కు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని చెప్పవచ్చు.