అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో నామినేట్ అయిన టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్..

సాధారణంగా బడా స్టార్‌లు వివిధ సినిమా అవార్డుల వేడుకల్లో నామినేషన్‌లు అందుకోవడం మనం చూస్తుంటాం. ఈ బడా స్టార్లు మాత్రమే పెద్ద అవార్డులను గెలుచుకుంటుంటారు. అయితే అత్యంత ఆకర్షణీయమైన అవార్డు వేడుకల్లో ఒకటైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడి విభాగంలో తాజాగా ఒక టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నామినేట్ అయ్యాడు. అతడు మరెవరో కాదు మనందరికీ బాగా పరిచయమున్న షఫీ.

‘ఖడ్గం’ ‘వర్షం’, ‘ఛత్రపతి’ సినిమాలతో పాటు చాలా మూవీలలో అద్భుతమైన నటన కనబరిచి ఎంతగానో అలరించిన టాలెంటెడ్ నటుడు షఫీ. ఈ యాక్టర్ అమిత్ రాజ్ వర్మ దర్శకత్వం వహించిన ‘3:15 AM’ షార్ట్ ఫిల్మ్‌లో, మధ్య వయస్కుడి పాత్రను పోషించాడు. ఈ థ్రిల్లర్ షార్ట్ ఫిల్మ్‌ లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో అవార్డును గెలుచుకుంది.

తరువాత షఫీ అత్యంత ప్రతిష్టాత్మక సినిమా అవార్డుకు నామినేట్ అయ్యాడు. “ఇలాంటి ప్రతిభావంతులైన నటులలో గుర్తింపు పొందడం అపురూపమైన గౌరవం” అని షఫీ అన్నారు. 50కి పైగా చిత్రాల్లో నటించిన షఫీ షార్ట్ ఫిల్మ్ చేయడానికి వెనుకాడలేదు. “డైరెక్టర్ అమిత్ నన్ను సంప్రదించినప్పుడు, నేను వెంటనే చేయడానికి అంగీకరించాను. ఇది షార్ట్ మూవీ అయినప్పటికీ, మాకు ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, కానీ కేన్స్ మా ప్రయత్నాన్ని గుర్తిస్తుందని ఊహించలేదు, ”అని షఫీ అన్నారు.

ఇన్ని రోజులూ, షఫీ తక్కువ క్రేజ్, టాలెంట్ ఉన్న నటుడిగా అందరూ అనుకున్నారు కానీ ఎవరిదైనా గౌరవంతో అతడి క్రేజ్ వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. ఇలాంటి టాలెంటెడ్ నటులు  సినిమాల్లో కాకపోయినా వెబ్ సిరీస్‌లలో రాణించవచ్చు. కానీ వారిని గుర్తు పెట్టుకొని అవకాశం ఇచ్చే వారే కరువయ్యారు.

Share post:

Latest