టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు పట్టిన గతి ఇది!!

తెలుగు ప్రేక్షకుల నాడిని పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఎలాంటి సినిమాలు తీస్తే ప్రేక్షకులకు నచ్చుతాయో అనే డౌట్‌తో టాలీవుడ్ నిర్మాతలు ఎప్పుడూ తలలు పట్టుకుంటున్నారు. సాధారణంగా తెలుగులో అసలు ఊహించని హైప్‌ లేని జాతిరత్నాలు, డిజే టిల్లు లాంటి చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా అవుతుంటాయి. దీనికి కారణం టాప్ బ్యానర్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అని చెప్పవచ్చు. అలాగే తెలుగువారికి ఆ పర్టికులర్ సినిమా బాగా రుచించిందని అనొచ్చు. ఇక పెద్ద బ్యానర్ లో చేసిన సినిమా అయినా ఎదురు తంతుందని చాలా విషయాల్లో స్పష్టమైంది.

రీసెంట్ టైమ్‌లో మారుతి లాంటి పెద్ద దర్శకుణ్ణి పెట్టి గీత, యువీ బ్యానర్స్ కలిసి నిర్మించిన ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇతర భాషా సినిమాలకి కూడా మనవారు పట్టం కడుతుంటారు. కొద్ది నెల క్రితం విడుదలైన విక్రమ్, కెజిఎఫ్ 2 లాంటి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే ప్రేక్షకుల అభిరుచి కి తగ్గట్టుగా తీసిన చిన్న సినిమాలు ఆశించిన స్థాయి లో కలెక్షన్స్ సాధించలేకపోయాయి. సందీప్ కిషన్ నటించిన మైఖేల్ సినిమా టేకింగ్, టెక్నికల్ వాల్యూస్ బాగున్నా చిన్న కాస్టింగ్ కాకుండా పెద్ద హీరో అయితే సినిమా మరో రేంజ్ కు వెళ్ళేదంటూ సామాన్య ప్రేక్షకుడు అభిప్రాయపడుతున్నాడు.

ఇక సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ కు విపరీతమైన హైప్ ఇచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా పాజిటివ్ టాక్ ను రాబట్టలేకపోయింది. పెద్ద హీరోలు నటించిన వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి, ధమాకా సినిమాలు రెగ్యులర్ కథలతో వచ్చినప్పటికీ హీరోస్ ఇమేజ్ వల్ల మంచి కలెక్షన్స్ రాబట్టాయి. చిన్న హీరోల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కేవలం కథను నమ్ముకొని చేస్తే మంచి టాక్ ను సాధించినా కలెక్షన్స్ మాత్రం రావడంలేదు. ఇక ఓటీటీ ప్లాట్‌ఫామ్ సైతం ఈ చిన్న హీరోల సినిమాలను కొనాలంటే చాలా తక్కువ ధరను ఆఫర్ చేస్తున్నాయి. దీని ఫలితంగా నెక్స్ట్ ఇయర్ నుంచి టాలీవుడ్ లో పెను మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. చిన్న హీరోలు తెర నుంచి కనుమరుగయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది.