తారకరత్న మరణ వార్తలపై క్లారిటీ ఇదే..!

తారకరత్న మరణం తర్వాత సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే గుండెపోటు వచ్చి గత 23 రోజులుగా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న తారకరత్న శనివారం శివరాత్రి రోజున శివైక్యం చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృత్యువుతో పోరాడి మరణించడం నిజంగా అందరినీ కలచివేసింది. ఇదిలా ఉండగా తారకరత్న అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆయన మరణం గురించి రోజుకొక వార్త వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం.

Mortal remains of actor Nandamuri Taraka Ratna arrive at his Mokila  residence - Telangana Today

ఈ క్రమంలోనే తారకరత్న 20 రోజుల క్రితమే మరణించారు అని అందుకు తగ్గట్లు రిపోర్టులు కూడా చెబుతున్నాయి అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అసలు విషయంలోకెళితే తారకరత్న లోకేష్ పాదయాత్రలో ఎప్పుడైతే గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారో.. అప్పుడే ఆయన గుండె ఆగిపోయిందని.. డాక్టర్లు సీపీఆర్ చేసినా లాభం లేకుండా పోయిందనే ఒక వార్త సోషల్ మీడియాలో తెగ జోరుగా చెక్కర్లు కొట్టింది. అయితే అందుకు సంబంధించి డాక్టర్లు కూడా రిపోర్టులు ఇచ్చారు అని సమాచారం. కానీ లోకేష్ పాదయాత్ర ఎక్కడ ఆగిపోతుందో అనే భయంతోనే ఈ విషయాన్ని ఇన్ని రోజులు దాచి పెట్టారని.. మృతదేహం పాడవకుండా ప్రత్యేకంగా డాక్టర్ల చేత మేనేజ్ చేయించారని సమాచారం.

మరొకవైపు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వైసిపి నాయకురాలు లక్ష్మీ పార్వతి కూడా మాట కలపడంతో ఇప్పుడు ఇదే నిజమని.. ఈ విషయం కాస్త అంతతా వ్యాపించింది.. ఒకవేళ తారకరత్న 20 రోజుల క్రితమే మరణించాడని అనుకుంటే.. ఒక మానవ శరీరం 20 రోజులకు పైగా పాడవకుండా ఎవరైనా చేయగలరా? పైగా ఫ్రీజర్ లాంటి చోట్ల కూడా తారకరత్నను ఉంచలేదు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.. అయితే కావాలని చంద్రబాబు, లోకేష్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.