ప్రాజెక్టు కె మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్టు కె.. సైన్స్ ఫిక్షన్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక మార్పు చిత్ర యూనిట్ స్పష్టం చేయడం జరిగింది. నిజానికి ముందుగా ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు మిక్కీ జే మేయర్ ను సంగీత దర్శకుడిగా అధికారికంగా ప్రకటించారు. కానీ ఆయన స్థానంలో సంతోష్ నారాయణన్ ను ఇప్పుడు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎందుకు మార్చారు అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Project K: 'న భూతో న భవిష్యతి'.. 'ప్రాజెక్ట్‌-కె' గురించి అశ్వనీదత్  క్లారిటీ.. మ్యూజిక్ డైరెక్టర్ ఛేంజ్..

ముఖ్యంగా ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. సీతారామం సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. కానీ వంద రోజులు థియేటర్లో ఆడ లేకపోయింది. వంద రోజుల సినిమా ఫంక్షన్ చేయాలన్న నా కోరిక ఈ చిత్రంతో నెరవేరలేదు.. అది మాత్రం చాలా బాధగా ఉంది అంటూ తన బాధను వెల్లడించింది. ప్రాజెక్టు కె సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ అయినా సరే ఇందులో సెంటిమెంటు ఎమోషన్స్ కూడా ఉంటాయని, ఇప్పటివరకు 70% షూటింగ్ కూడా పూర్తయినట్లు స్పష్టం చేశారు.

ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపిక లకు స్క్రీన్ ప్రజెంట్ ఎక్కువగా ఉంటుంది. వీరు ముగ్గురు కూడా చాలా సన్నివేశాలలో కనిపిస్తారు. ముఖ్యంగా ప్రేక్షకులు ఇప్పటివరకు పొందని సరికొత్త అనుభూతిని ఈ ప్రాజెక్టు కే ద్వారా పొందుతారు. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ సుమారుగా 6 కంపెనీలు చేస్తున్నాయి. వాటిని తెరపై చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది అంటూ తెలిపారు అశ్వినీ దత్. ఇకపోతే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తామని కూడా ఆయన ప్రకటించారు.

Share post:

Latest