ఆ ఫ్యామిలీ నన్ను తొక్కేయాలని చూసింది.. పోసాని కామెంట్స్ వైరల్.!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో కష్టాలు పడుతూ.. ఆ తర్వాత అంచలంచే లుగా ఎదుగుతూ వచ్చారు.. పవర్ఫుల్ డైలాగ్ లు రాయడంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకతమైన గుర్తింపు కూడా ఉంది. ముఖ్యంగా రచయితగా .. దర్శకుడిగా కూడా ఆయన దారి విభిన్నం అనే విషయం అందరికీ తెలిసిందే. నటుడిగా విలక్షణమైన పాత్రలను చేస్తూ వచ్చిన ఆయన కామెడీ టచ్ ఉన్న విలన్ రోల్స్ చేయడంలో కూడా ఎక్కువ మార్కులు పొందారు. సాధ్యమైనంతవరకు పోసాని కృష్ణ మురళి తో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉన్నత స్థాయికి చేరుకున్నారని చెప్పవచ్చు.

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పోసాని కృష్ణమురళి తన గతం గురించి వివరించారు. నేను బాగా చదువుకున్నాను.. రేపో మాపో మంచి ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో నాకు పిల్లను ఇవ్వడానికి చాలామంది ముందుకు వచ్చారు. రైటర్ గా అవకాశాలు లేకపోయినా బ్రతకగలడు అనే భరోసాతోనే నాకు పిల్లలు ఇవ్వడానికి వచ్చారు.. నేను పద్ధతిగా ఉండేవాడిని ఎవరిని ఒక కామెంట్ కూడా చేసే వాడిని కాదు.. అలా నాకు వచ్చిన సంబంధాలను ఒక ఫ్యామిలీ నా గురించి చెడుగా చెబుతూ పెళ్లి కుదరనీయలేదు.

వాళ్లు నా గురించి లేనిపోని మాటలు చెప్పేవారు. ముఖ్యంగా బయట చెప్పే మాటలు ఏమిటో నాకు కూడా తెలుసు. కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను.. ఒక దశలో మాత్రం నా ఓపిక నశించి కత్తి కొని పుస్తకంలో పెట్టుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు పోసాని. ప్రస్తుతం రాజకీయాలలో కూడా కీలక పదవిలో కొనసాగుతున్నారు. ఇకపోతే పోసాని చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest