పెళ్లి కోసం తమన్నా ఇలా మారిపోయిందేంటి… వైర‌ల్ వీడియో..!

సౌత్ ఇండియాలోనే అగ్ర హీరోయిన్‌గా రాణిస్తున్న తమన్నా భాటియా తెలుగు, తమిళ భాషలో స్టార్ హీరోలకు జంటగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల కాలంలో బాలీవుడ్ లోనూ వరుస‌ సినిమాలు చేసుకుంటూ పోతుంది. అయితే వాటిలో ఆమెకు ఆశించిన విజయాలను అందించలేక పోతున్నాయి. సౌత్ పరిశ్రమంలోనూ ఒకటి రెండు సినిమాలు చేస్తున్న కూడా ఇక్కడ పరిస్థితి కూడా అలానే ఉంది.

ఈ క్రమంలోనే రీసెంట్గా తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటూ అతనితో చట్టా పట్టలేసుకొని తిరుగుతూ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు ఆమెకు పెళ్లి పైకి తన మనసు మళ్లినట్టు కనిపిస్తుంది. కారణం ఏదైనా గత కొన్ని రోజులుగా గుడులు చుట్టూ తిరుగుతూ పూజలు చేస్తూ ఆధ్యాత్మిక బాట పట్టింది. తనుకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఆలయాలకు వెళుతూ దైవ ప్రార్థనలో మునిగిపోతుంది.

రీసెంట్ గానే హిమాలయాలకు వెళ్లి అక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిన వైష్ణవి దేవి ఆలయంలో విశేష పూజలను నిర్వహించింది. ఆ ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా ఇప్పుడు ఈమె ఈషా యోగ ప్రాంగణానికి కాషాయ రంగు దుస్తులతో తలుకున్నా మెరిసింది. అక్కడ లింగాభైరవి దేవిని దర్శించుకుంది. ఆ వీడియోని కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఈశా యోగాశ్రమం నుంచి ఆహ్వానం రావడంతో ఎంతో సంతోషానికి గురయ్యారని చెప్పింది. లింగ భైరవి దేవిని దర్శించుకోవడం ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగించిందని పేర్కొంది.

అంతేకాకుండా జీవితంలో భయం, అపజయాల గురించి ఆందోళన దూరమవుతోందని చెప్పింది. లింగభైరవి విగ్రహాన్ని ఇంటికి తీసుకెళ్తానని పేర్కొంది. అక్కడి పరిసరాలు, లింగ భైరవి మూర్తీభం చూడగానే ఏదో తెలియని ఆధ్యాత్మిక అనుభూతికి లోనైనట్లు పేర్కొంది. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో చిరంజీవికి జంటగా భోళాశంకర్, తమిళంలో రజనీకాంత్‌ సరసన జైలర్‌ చిత్రాల్లో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)