ఆ విషయాలలో తగ్గేదే లేదంటున్న స్టార్ హీరోయిన్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. ఇందులో కొంతమంది వివాహం చేసుకొని సెటిల్ అవ్వగా మరికొంతమంది వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వివాహమైనప్పటికీ కూడా కొంతమంది రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గేదే లేదంటున్నారు. ఈ మాటపై నిలబడిన హీరోయిన్స్ నయనతార ,సమంత, కాజల్ ,హన్సిక తదితర హీరోయిన్లు ఉన్నారు.

Hansika Motwani or Nayanthara - Who's the REAL 'Queen Of The South'? |  IWMBuzz
నయనతార రేంజ్ రోజురోజుకి పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. డైరెక్టర్ విగ్నేష్ తో వివాహం అనంతరం మేము ఏకంగా ఒక్కో చిత్రానికి రూ .10 కోట్లు డిమాండ్ చేస్తోందట. గతంలో ఒక్కో సినిమాకి రూ .6 కోట్ల రూపాయలు తీసుకునేదని సమాచారం.

ఇక సమంత, నాగచైతన్యత విడాకుల తర్వాత మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో సినిమాల వేగాన్ని కూడా పెంచేసింది. పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. ఈ రకంగా రెండు చేతుల సంపాదిస్తున్న సమంతా ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ .6కోట్లు డిమాండ్ చూస్తోందనీ సమాచారం. కానీ గతంలో ఒక్క చిత్రానికి రూ .4కోట్లు ఛార్జ్ చేసేదట.

Hansika Motwani, Nayanthara, Samantha Ruth Prabhu and more South Indian  actresses who have TEMPLES dedicated to them
అలాగే మరొక హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా వివాహమై ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న 108వ సినిమాకు ఈమెను ఎంపిక చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి . అందుకుగాను రూ .3 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోందని సమాచారం. గతంలో ఒక్కో చిత్రానికి రూ .2 కోట్లు మాత్రమే అందుకునేది.

ఇక టాలీవుడ్, బాలీవుడ్ ,కోలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న హీరోయిన్ హన్సిక ఇటీవల వివాహం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ ఒక చిత్రానికి రూ .2 కోట్లు డిమాండ్ చేస్తోందట.

ఇక కొంతమంది హీరోయిన్లకు అవకాశాలు లేకపోయినా వచ్చిన సినిమా ఒప్పుకోవాలి అంటే కొన్ని కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

Share post:

Latest