తారకరత్న మృతి పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి..!!

తారకరత్న మరణ ప్రస్తుతం యావత్ సినీ , రాజకీయ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న శ్రీ రెడ్డి మాత్రం తారకరత్న మరణం పైన పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తారకరత్న మరణానికి నారావారి క్షుద్ర పూజలు కారణమంటూ వ్యాఖ్యానిస్తోంది. వీళ్ళ పూజల వల్ల తారకు బలైపోయాడు అంటూ శ్రీరెడ్డి తెలియజేయడం జరుగుతోంది.బిడ్డ వచ్చిన వేల గొడ్డు వచ్చిన వేళ అంటారు మన తెలుగోళ్ళు.. మొదటి రోజు యాత్రకు వాళ్లు చేయించిన క్షుద్ర పూజలకు నిన్ను బలి ఇచ్చారు మిత్రమా అంటూ తెలియజేస్తోంది.

sri reddy controversial comments to taraka ratna died | Vaartha

ఇది నీతోనే ఆగేది కాదులే నువ్వు మూడవ వాడివి అంతే.. ఇంకా లెక్క ఆగలే రక్తదానం రాజకీయం మీకు శాపాలై పీడిస్తున్నాయి.. నేను ముందు నుంచే చెబుతూ ఉన్న వింటేగా తస్మాత్ జాగ్రత్త నీ ఆత్మకు శాంతి అంటూ సంచలనం చేసింది శ్రీరెడ్డి. ప్రస్తుతం ఈ ట్వీట్ పై నందమూరి అభిమానులు టిడిపి, అభిమానులు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే నందమూరి తారకరత్న నిన్నటి రోజున రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే.

23 రోజుల క్రితం నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. ఆ వెంటనే అక్కడ మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. ఇక అప్పటినుంచి మెరుగైన వైద్యం అందించినప్పటికీ తారకరత్న లో ఎలాంటి స్పర్శ లేదు.. దీంతో నిన్నటి రోజున చికిత్స పొందుతూ మరణించినట్లుగా తెలుస్తోంది. తారకరత్న భౌతికాయాన్ని రంగారెడ్డి జిల్లా మొకీలలో నీ తన నివాసానికి తరలించారు.

Share post:

Latest