కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్న స్నేహ రెడ్డి.. పిచ్చెక్కిస్తున్న వీడియో!

పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి అందరికి సుపరిచుతురాలే. ఇండస్ట్రీలో అల్లు అర్జున్‌కి ఎంత క్రేజ్ ఉందో సోషల్ మీడియాలో స్నేహ రెడ్డికి కూడా అంతే క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ తన కూతురు, కొడుకుతో చేసే అల్లరి పనులను రికార్డు చేసి సోషల్ మీడియాలోని అభిమానులతో పంచుకుంటుంది స్నేహ. ఇక ఈ మధ్య వెరైటీ ఔట్‌ఫిట్స్ ధరించి వార్తలలో నిలుస్తుంది ఈమె. హీరోయిన్ల అందానికి ఏమాత్రం తగ్గకుండా రకరకాల ఔట్‌ఫిట్స్ తో గ్లామర్ ట్రీట్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది స్నేహ.

 

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

ఇండస్ట్రీ లో క్యూట్ అండ్ స్టైలిష్ కపుల్స్ లో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి పేర్లు ముందు వరుసలో ఉంటాయి. అయితే ఇటీవలే ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియో ని షేర్ చేస్తూ ‘ మన చుట్టూ మొక్కలు ఉంటే అంతకు మించిన సంతోషం ఇంకా ఏముంది. మొక్కలు పెంచడం వల్ల ఏదో తెలియని ఆనందం ఉంటుంది. అందుకే నర్సరీ నాకు చాలా ఇష్టమైన ప్రదేశం. మొక్కలను చూస్తే నేను ప్రేమలో పడిపోతా’ అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియలో స్నేహ చాలా అందంగా, స్టైలిష్ గా, ఫిట్ గా కనబడుతుంది. దాంతో స్నేహ నువ్వు హీరోయిన్స్ కి ఆ మాత్రం తగ్గడం లేదు అని కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి స్నేహ రెడ్డి ఇద్దరు పిల్లలకు తల్లి. 2014లోనే ఆమెకి ఒక బాబుకి జన్మనిచ్చింది. అప్పటికే ఆమెకు 30 ఏళ్ల వయసు ఉంది. అప్పటికి ఇప్పటికీ ఈ బ్యూటీ ఏమాత్రం అందాన్ని కోల్పోలేదు. పైగా హీరోయిన్లకు ఏమాత్రం తీసుపోసి గ్లామర్ తో అందరితో కళ్ళను తనవైపే తిప్పుకుంటోంది.

Share post:

Latest