క్లీన్ హిట్‌గా `సార్‌`.. 3 రోజుల్లోనే ధ‌నుష్ సినిమాకు భారీ లాభాలు!

కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ తెలుగులో చేసిన డ‌బ్యూ మూవీ `సార్‌`. ఇందులో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టిస్తే.. సాయికుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని, తనికెళ్లభరణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు.

వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. ముఖ్యంగా తెలుగు విడుద‌లైన మూడు రోజుల్లోనే సార్ క్లీన్ హిట్ గా నిలిచి.. లాభాల బాట ప‌ట్టింది.

ఫ‌స్ట్ డే రూ. 2.65 కోట్లు, రెండో రోజు రూ. 3.15 కోట్ల షేర్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. మూడో రోజు రూ. 3.05 కోట్ల షేర్ ను ద‌క్కించుకుంది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.50 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌గా.. రూ. 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తోనే బ్రేన్ ఈవెన్ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు రూ. 3.05 కోట్ల ప్రాఫిట్ తో దూసుకెళ్తుంది. ఇక ఏరియాల వారీగా సార్ 3 డేస్ టోట‌ల్‌ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 3.55 కోట్లు
సీడెడ్: 1.23 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 1.15 కోట్లు
తూర్పు: 88 ల‌క్ష‌లు
పశ్చిమ: 33 ల‌క్ష‌లు
గుంటూరు: 74 ల‌క్ష‌లు
కృష్ణ: 62 ల‌క్ష‌లు
నెల్లూరు: 35 ల‌క్ష‌లు
—————————————
ఏపీ+తెలంగాణ‌= 8.85 5 కోట్లు(16.39 కోట్లు~ గ్రాస్‌)
—————————————

క‌ర్ణాట‌క‌+ఓవ‌ర్సీస్: 0.90 కోట్లు
———————————————
టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్‌= 9.75 కోట్లు(18.20కోట్లు~ గ్రాస్‌)
———————————————