`సార్‌` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. తొలి రోజే స‌గం టార్గెట్ ఔవుట్‌!

తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్త హీన‌న్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `సార్‌(త‌మిళంలో వాతి). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్‌ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సాయికుమార్‌, స‌ముద్ర‌ఖ‌ని, తనికెళ్లభరణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ధ‌నుష్ తెలుగులో నేరుగా చేసిన తొలి చిత్ర‌మిది.

నిన్న తెలుగు, త‌మిళ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌ల అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. దాంతో ఈ సినిమా తెలుగులో బాక్సాఫీస్ వ‌ద్ద‌ అదిరిపోయే రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తొలి రోజే దాదాపు స‌గం టార్గెట్ ను రీచ్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ గా జోరు చూపించి ఏకంగా 2.65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది.

ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.50 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. రూ. 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. అంటే ఈ సినిమా తెలుగులో క్లీన్ హిట్ గా నిల‌వాలంటే ఇంకా రూ. 3.35 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకోవాల్సి ఉంటుంది. ఇక ఏరియాల వారీగా సార్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 1.04 కోట్లు
సీడెడ్: 30 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 34 ల‌క్ష‌లు
తూర్పు: 27 ల‌క్ష‌లు
పశ్చిమ: 10 ల‌క్ష‌లు
గుంటూరు: 25 ల‌క్ష‌లు
కృష్ణ: 20 ల‌క్ష‌లు
నెల్లూరు: 15 ల‌క్ష‌లు
—————————————
ఏపీ+తెలంగాణ‌= 2.65కోట్లు(4.52గ్రాస్‌~ గ్రాస్‌)
—————————————

Share post:

Latest