చీర‌లో సంయుక్త సోయ‌గాలు.. చూపు తిప్పుకోలేక‌పోతున్న కుర్ర‌కారు!

టాలీవుడ్ లో త‌క్కువ స‌మ‌యంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో సంయుక్త మీన‌న్ కూడా చేరింది. తెలుగులో ఈమె న‌టించిన `భీమ్లా నాయ‌క్‌`, `బింబిసార‌` చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి.

ఇప్పుడు ఈ అమ్ముడు `సార్‌(త‌మిళంలో వాతి)` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధమైంది. కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ తెలుగులో డైరెక్ట్ గా చేసిన చిత్ర‌మిది. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అలాగే సంయుక్త మెగా మేన‌ల్ల‌డు వైష్ణ‌వ్ తేజ్ కు జోడీగా `విరూపాక్ష‌` మూవీలో న‌టిస్తోంది.

షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ లో విడుద‌ల కాబోతోంది. ఇదిలా ఉందే.. సంయుక్త లేటెస్ట్ ఫోటో షూట్ కుర్ర‌కారు తెగ ఎట్రాక్ట్ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, ట్రాన్స్ప‌రెంట్ శారీలో అందంగా ముస్తాబై ద‌ర్శ‌న‌మిచ్చింది.

చీర‌లో సంయుక్త సోయ‌గాల‌కు కుర్ర‌కారు చూపు తిప్పుకోలేక‌పోతున్నారు. అంత అందంగా సంయుక్త ఆక‌ట్టుకుంటోంది. మ‌రి లేటెందుకు మీరు సంయుక్త తాజా పిక్స్ పై ఓ లుక్కేసేయండి.

Share post:

Latest