టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొద్ది నెలలు క్రితం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. మయోసైటిస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత.. మళ్ళీ షూటింగ్స్ లో బిజీగా మారుతుంది. అయితే క్లిష్ట పరిస్థితుల్లోనూ వృత్తిపట్ల సమంత ఎంత డెడికేషన్ చూపిస్తుందో తాజా సంఘటనతో రుజువయింది.
ప్రస్తుతం సమంత `సిటాడెల్` వెబ్ సిరీస్ షూటింగ్ లో భాగమైంది. రాజ్ & డీకే రూపొందిస్తున్న ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్లో శ్రీలంక రెబల్ రోల్ చేసిన సమంత.. సిటాడెల్ లో మరోసారి యాక్షన్ ఓరియెంటెడ్ రోల్ లో అలరించబోతోంది. ఈ నేపథ్యంలో పాత్రలో ఒదిగిపోయేందుకు శిక్షణ తీసుకుంటోంది.
అది కూడా గడ్డ కటే చలిలో. నైనితాల్ లోని ఓ ఆశ్రమానికి వెళ్లి సామ్.. అక్కడ రాత్రి వేళ ఎముకలు కొరికే చలిలో బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోను సామ్ ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. `నా ఫేవరెట్ వ్యక్తి యానిక్ బెన్` అనే క్యాప్షన్ ఉంచింది. ఇక నైనితాల్ ను లొకేషన్ గా ట్యాగ్ చేస్తూ 8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లు తెలిపింది. స్పోర్ట్స్ వేర్ లో కనిపించిన సామ్.. సీరియస్ గా ట్రైనింగ్ చేస్తూ ఉండటం అభిమానులను ఆకట్టుకుంది. సమంత డెడికేషన్ కు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా షాకైపోతున్నారు.
@samanthaprabhu2 Practice In Cold #Samantha #samanthahot #boxing #samantharuthprabhu #cidetal pic.twitter.com/gey40lBlaO
— Cinema News World (@CinemaNewsWorld) February 20, 2023