ఎట్టకేలకు సోషల్ మీడియాలో అప్డేట్ తెలిపిన సాయి పల్లవి..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ సాయి పల్లవి. మొదట ఫిదా సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నది. తను నటించే ప్రతి పాత్రలో కూడా ప్రాణం పెట్టి నటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించింది మేకప్ లేకుండా కూడా పలు సినిమాలలో నటిస్తూ ఉంటుంది. అయినా కూడా తన అందంతో అభినయంతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.

Sai Pallavi Says Smiles, Hope, Gratitude Is Important In Life - Sakshi
గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి సోషల్ మీడియాలో ఈమె గురించి పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. సినిమాలకు గుడ్ బై చెప్పేసిందని త్వరలో వివాహం చేసుకోబోతోందని రూమర్స్ బాగా వినిపించాయి. అయితే ఈ విషయాలపై ఎప్పుడూ కూడా సాయి పల్లవి స్పందించలేదు.ఇప్పుడు తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా సాయి పల్లవి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అంతేకాకుండా స్మైల్ హోప్స్ అండ్ గ్రాటిట్యూడ్ అంటూ రాసుకు వచ్చింది. అందులో బ్యాక్ గ్రౌండ్లో మంచి మ్యూజిక్ పెట్టి ఫ్యాన్స్ ని ఖుషి చేస్తోంది.

Image
ముఖ్యంగా ఎల్లో కలర్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకున్న సాయి పల్లవి చాలా క్యూట్ గా స్మైలిస్తోందని ఈ ఫోటోలను చూస్తే చెప్పవచ్చు. సోఫాలో పడుకొని రెండు చేతులతో జుట్టు పట్టుకొని మరీ తన పళ్ళు కనిపించేలా నవ్వుతోంది ఈ ఫోటో చూస్తే ఆమె సంతోషంగా ఉన్నట్లుగా అర్థమవుతోంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు 6.5 మిలియన్ల ఫాలో అవర్స్ ఉన్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)

Share post:

Latest