ఆ స్టార్ హీరోయిన్ పై మనసు పడ్డ రామానాయుడు.. ఆ పని కూడా చేశారా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అప్పట్లో నిర్మాతలకు చాలా క్రేజ్ ఉండేది. ఎక్కడ చూసినా వీరి గురించి చర్చ నడుస్తూ ఉండేది. అలాంటి దిగ్గజ నిర్మాతలలో దగ్గుబాటి రామానాయుడు కూడా ఒకరు. ఈయన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించారు. ముఖ్యంగా చాలామంది హీరోలను తెలుగు తెరకు పరిచయం చేశారు కూడా.. ఎన్టీఆర్ , ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తీసి సక్సెస్ పొందడమే కాదు కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వారిని కూడా హీరోలుగా మార్చి తమ బ్యానర్ పై వారి భవిష్యత్తును తీర్చిదిద్దారు రామానాయుడు.. అందుకే అప్పట్లో ఆయనకు మంచి ఇమేజ్ ఉండేది . అంతేకాదు ఆయన తన బ్యానర్ పై తెరకెక్కించే ప్రతి సినిమా కూడా సక్సెస్ గా నిలిచింది.

ANR 75 years Sanmanam Press Meet Stills | New Movie Posters

ముఖ్యంగా ఆయన బ్యానర్లో వాణి శ్రీ , జయప్రద, జయసుధ లాంటి వారికి పర్మినెంట్ ప్లేస్ కూడా ఉండేది. అందులోని ముఖ్యంగా వాణిశ్రీ అంటే రామానాయుడు కి స్పెషల్ అట్రాక్షన్ కూడా.. ఆయన ఆ హీరోయిన్ పై మనసు పడ్డారని అప్పట్లో వార్తలు కూడా తెగ జోరుగా వినిపించాయి. అందుకే ఆమెను తన బ్యానర్ లో వచ్చే సినిమాలలో ఎక్కువగా తీసుకునే వారని సమాచారం.ముఖ్యంగా అప్పట్లో శోభన్ బాబు , వాణిశ్రీ కాంబినేషన్లో దాదాపు 11 సినిమాలను రామానాయుడు నిర్మించారు. దీన్ని బట్టి చూస్తే ఆమె మీద ఆయనకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండేదో అర్థమవుతుంది..

ఇదే విషయమై రామానాయుడు ని ఒక ఇంటర్వ్యూలో భాగంగా అడిగినప్పుడు.. ఆయన తన బ్యానర్లో చేసిన అందరు హీరోయిన్లపై కూడా మనసు పడ్డాను అంటూ తెలివిగా సమాధానం ఇచ్చి తప్పించుకున్నారు. కానీ ఆమె కోసమే ప్రత్యేకంగా కథలను కూడా తయారు చేయించేవారు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి..

Share post:

Latest