షారుఖ్ ని వెనక్కి నెట్టి నంబర్.1 పొజిషన్‌లో నిలిచిన రాశిఖన్నా..

టాలీవుడ్ సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోయింది రాశి కన్నా ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి పోయే అక్కడ వెబ్‌సిరీస్‌లు, సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ముద్దుగుమ్మ. ఒక వారం పాటు, షారుఖ్ ఖాన్‌ను వెనక్కి నెట్టి నంబర్ 1 ఇండియన్ సెలబ్రిటీగా అవతరించింది. నిజానికి ఇది ఊహకందనిది. ఈ బబ్లీ గర్ల్ కూడా ఈ నిజాన్ని నమ్మలేకపోతోంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎక్కడ నంబర్ 1గా నిలిచిందో తెలుసుకుంటే..

ప్రముఖ IMDb వెబ్‌సైట్ “పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్” అనే కొత్త ఫీచర్ ఒకటి తీసుకొచ్చింది. ఇందులో లేటెస్ట్ వీక్లీ లిస్ట్‌లో రాశి ఖన్నా నం.1 స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో షారుక్ ఖాన్, విజయ్ సేతుపతి, రెజీనా కసాండ్రా, ఆదిత్య చోప్రా, ఇతరులు ఉన్నారు. “ఫర్జీ” వెబ్ సిరీస్‌లో రాశి ఒక మీటీ రోల్ పోషించింది. దాని కారణంగానే షారుఖ్, దీపిక (6వ స్థానం) వంటి వారిని ఓడించి లిస్ట్‌లో నంబర్.1 స్థానంలో నిలిచింది.

IMDb ప్రకారం, ఈ లిస్ట్‌ యూజర్ల ఓట్లు, ఇండియన్ ఫ్యాన్స్ నుంచి సైట్ స్వీకరించే పేజీ వ్యూస్ ఆధారంగా క్రియేట్ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ, రాశి కూడా ఈ సంఘటనతో షాక్ అయ్యింది. ఇప్పుడు గురించి అందరికీ చెప్తూ సంతోషం వ్యక్తం చేస్తుంది. మరి ఫర్జీ వెబ్ సిరీస్ తో మళ్లీ లైమ్‌ లైట్ లోకి వచ్చిన రాశికి సినిమా అవకాశాలు పెరుగుతాయో లేదో చూడాలి.

ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ పన్ను, తమన్నా, సమంత ఇలా ఈ రోజుల్లో చాలామంది హీరోయిన్లు  బాలీవుడ్ వైపే అడుగులు వేస్తున్నారు. అక్కడికి వెళ్ళాక విపరీతమైన గ్లామర్ షోలు చేస్తున్నారు. రాశి కన్నా కూడా అదే బాటలో నడుస్తూ తన అందాలను విపరీతంగా చూపించేస్తోంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్నాయి.

Share post:

Latest