పెద్దాపురం సీటుపై క్లారిటీ..రాజప్పకు రూట్ క్లియర్!

గత కొన్ని రోజులుగా పెద్దాపురం సీటుపై కన్ఫ్యూజన్ ఉన్న విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు అక్కడ టి‌డి‌పి నుంచి గెలిచిన నిమ్మకాయల చినరాజప్పని ..ఈ సారి వేరే సీటుకు పంపించి.పెద్దాపురం సీటుని కమ్మ నేతకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ సారి రాజప్పని రాజానగరం సీటుకు పంపిస్తారని, పెద్దాపురం సీటుని కమ్మ వర్గానికి చెందిన బొడ్డు ఫ్యామిలీకి ఇస్తారని టాక్ నడిచింది.

కానీ ఆ ప్రచారానికి టి‌డి‌పి అధినేత చంద్రబాబు తాజాగా చెక్ పెట్టారు. తాజాగా పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించిన బాబు..అక్కడ జరిగిన రోడ్ షోలో మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నుంచి రాజప్పని మూడోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. పెద్దాపురం సీటు విషయంలో కన్ఫ్యూజంన్ వద్దని, మళ్ళీ రాజప్ప పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు. అలాగే ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న నేతలకు అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని ప్రకటించారు. ఇలా పెద్దాపురం సీటు విషయాన్ని చంద్రబాబు తేల్చేశారు.

అయితే గత రెండు ఎన్నికల్లో పెద్దాపురం నుంచి రాజప్ప వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా గెలుపు అవకాశాలు బాగానే ఉన్నాయి. కానీ ఈ సారి పెద్దాపురం సీటుని ఎలాగైనా దక్కించుకోవాలని వైసీపీ చూస్తుంది. వైసీపీ తరుపున దవులూరి దొరబాబు పనిచేస్తున్నారు. కానీ అనుకున్న మేర పార్టీని బలోపేతం చేయలేదు. అదే సమయంలో ఇక్కడ జనసేనకు కాస్త బలం ఉంది.

ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే ..డౌట్ లేకుండా పెద్దాపురం సీటులో వైసీపీ గెలవదని అంటున్నారు. మళ్ళీ ఇక్కడ టి‌డి‌పి హవా నడుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.