మెగా బ్రదర్స్ పై నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్..!!

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ గడిచిన కొంతకాలంగా యువ గళం పేరుతో ఆంధ్ర ప్రదేశ్ లో పాదయాత్రను నిర్వహిస్తున్నారు. కుప్పంలో మొదలైన ఈ యాత్ర ఇప్పుడు తిరుపతి వరకు కొనసాగుతోంది. ఇందులో భాగంగా నిన్నటి రోజున తిరుపతిలో కొంతమంది యువతతో ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు లోకేష్ కూడా పలు ఆసక్తికరమైన సమాధానాలను తెలియజేశారు. ఈ సమయంలోనే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల పైన ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసినట్టుగా తెలుస్తోంది.

Nara Lokesh : లోకేష్ కు తిరుపతి పోలీసుల నోటీసులు..! పాదయాత్రకు నో పర్మిషన్  ! | tirupati police notices to tdp leader nara lokesh-here are details.. -  Telugu Oneindia

లోకేష్ మాట్లాడుతూ నేను మెగాస్టార్ చిరంజీవికి అభిమానిని ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య సినిమా చూశాను.. ఇక మా బాల మామ గురించి చెప్పాలంటే ఎంతైనా నా ముద్దుల మామయ్య అన్ స్టపాబుల్ , బాలయ్య కొత్త సినిమా రిలీజ్ అయితే మొదటి షో కి మొదట ఉండేది నేనే అని లోకేష్ తెలిపారు.ఇక ఈ సమయంలోనే జనసేన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ రాజకీయాల్లోకి రావాలి అంటే ముందు మంచి మనసు ఉండాలి.. 2014 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఆ మంచి మనసును నేను చూశానని తెలిపారు అలాంటివారు రాజకీయాలలో తప్పకుండా ఉండాలని తెలిపారు.

2024 లో ఎన్నికలలో జనసేనతో కలిసి బరిలోకి దిగే ఆలోచన ఉంది టిడిపికి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రస్థానం ఉండాలని కోరుకునే వాళ్లంతా రాజకీయాల్లోకి రావాలని నారా లోకేష్ తెలియజేశారు. అందులో ప్రత్యేకంగా మెగ బ్రదర్స్ గురించి మాట్లాడడంతో అందరికీ ఆసక్తికరంగా మారిపోయింది. ఇక ఎన్టీఆర్ కూడా పొలిటికల్ ఎంట్రీ పై కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్.

Share post:

Latest