చిరంజీవి కుమార్తెపై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్!

 

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు కొణిదెల సుస్మిత మనందరికీ సుపరిచితురాలే. ప్రస్తుతం సుస్మిత, ఆమె భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ను ప్రారంభించారు. ఇక ఈ బ్యానర్‌పై సుస్మిత ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ప్రశాంత్ కుమార్ దిమ్మేల దర్శకత్వం వహిస్తుండగా, సంతోష్ శోభన్ హీరోగా, గౌరీ జీ. కిషన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌కి తండ్రిగా నాగబాబు నటించారు. శ్రీదేవి శోభన్ బాబు సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో సుస్మిత, విష్ణు ప్రసాద్, సంతోష్ శోభన్ గౌరీ జీ కిషన్, నాగబాబు, ప్రశాంత్ కుమార్ లతో పాటు కొంత చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ తన అన్న కూతురు అయిన సుస్మితపై ప్రశంసలు కురిపించారు. నాగబాబు ఇంట్లో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు కానీ వారెవ్వరూ నాగబాబుకి వారి సినిమాలలో అవకాశం ఇవ్వలేదట. అలాంటిది సుస్మిత మొదటి సినిమా లో ఆయనకు అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని నాగబాబు చెప్పారు.

“సుస్మిత తీస్తున్న సినిమాని ప్రమోట్ చేయమంటే చాలామంది స్టార్ హీరోలు ముందుకు వస్తారు కానీ ఎవరి సహాయం తీసుకోకుండా తన కష్టాన్ని అనుభవంగా మలచుకొని సినిమా రూపంలో మీ ముందుకు తీసుకొచ్చింది. త్వరలోనే సుస్మిత పెద్ద ప్రొడ్యూసర్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది.” అని నాగబాబు పేర్కొన్నాడు. అలానే సుస్మితకి, ఆమె భర్త విష్ణు ప్రసాద్‌కి శుభాకాంక్షలు తెలియజేశాడు.

Share post:

Latest