ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న మీరాజాస్మిన్..!

దాదాపుగా 20 సంవత్సరాల క్రితం అమ్మాయి బాగుంది అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ మీరాజాస్మిన్. దాదాపుగా పది సంవత్సరాలపాటు తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆ మధ్య కాస్త స్లో అయ్యి గ్యాప్ ఇచ్చింది. 2013.. 14 నుంచి ఈమె అసలు సినిమాలలో కనిపించలేదు.. తెలుగు సినిమాలలో మీరాజాస్మిన్ నటించక దాదాపుగా 10 సంవత్సరాలు కావస్తోంది అయినా కూడా ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు స్టార్ హీరోల హిట్ సినిమాలలో నటించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది.

తనకు ఉన్న గుర్తింపు ద్వారానే సోషల్ మీడియా లో కూడా భారీగా పాపులారిటీ దక్కించుకుంటుంది. ప్రస్తుతం వరుస హాట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్న ఈమె ఒకప్పుడు పద్ధతిగా చీర కట్టులో కనిపించి.. ఇప్పుడు ఒక్కసారిగా క్లీవేజ్ షో చేసి అందంగా , హాట్ గా కనిపించడంతో చాలామంది నోరు వెళ్ళబెట్టారు. ఇన్నాళ్లు ఈ అందం వృధా అయ్యింది అంటూ అభిమానులతో పాటు నిర్మాతలు కూడా తెగ కామెంట్లు చేశారు. సోషల్ మీడియా ద్వారా తన వయసు పెరిగినా కూడా అందం మాత్రం తగ్గలేదు అని చెప్పకనే చెబుతూ హాట్ ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. దాంతో మీరాజాస్మిన్ కి టాలీవుడ్ లో కూడా బాగా ఆఫర్లు దక్కుతున్నట్లు తెలుస్తోంది.

పాత్ర ఏంటి? సినిమా ఏంటి? అనే విషయాలను పక్కన పెడితే 10 సంవత్సరాల తర్వాత టాలీవుడ్ లో మళ్లీ మనకు అవకాశం లభించడం నిజంగా ఆమె పట్టుదలే ఇందుకు కారణమని చెప్పవచ్చు. సీనియర్ హీరోయిన్స్ లో ఎంతోమంది సినిమాలకు దూరంగా ఉంటున్నా కూడా అందంగా కనిపిస్తున్న వారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు కాబట్టి వారు మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చి నటించాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోని మీరాజాస్మిన్ కూడా ఇలా ఆలోచించి ఇండస్ట్రీలోకి రాబోతోంది. ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే మళ్ళీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న సీనియర్ హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ .

Share post:

Latest