ఈ నెలలోనే ఓటీటికి విడుదలకు సిద్ధమైన.. మైఖెల్..!!

సాధారణంగా ఏ సినిమా అయినా మొదటగా థియేటర్లో విడుదలైన తరువాత ఓటిటిలోకి రావడం జరుగుతూ ఉంటుంది.. కానీ సందీప్ కిషన్ నటించిన మైఖేల్ చిత్రం ఇదే నెలలో డిజిటల్ ప్లాట్ఫామ్ పై సందడి చేయబోతోంది. ఈ సినిమా ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ హీరో సందీప్ కిషన్ ను కూడా నిరాశపరిచింది.ఈ సినిమా డిజిటల్ స్ట్రిమ్మింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటి ఆహా సొంతం చేసుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 24న ఈ సినిమాను స్ట్రిమ్మింగ్ చేయనున్నట్టు ప్రకటించింది. ఆహా రెడీగా ఉండండి పిచ్చెక్కించే యాక్షన్ తో రాబోతున్నాడు మనం మైఖేల్ నాన్ స్టాప్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని ఆహా ట్విట్ చేసింది.

Michael Movie OTT Release Date - Digital Rights | Watch Online - OTT RAJA

ఇందులో హీరో సందీప్ కిషన్ మునుపెన్నడు చూడని యాక్షన్ పాత్రలో కనిపించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మైఖేల్. ఇక సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రమైన మైఖేల్ కి రంజిత్ జయకోడి దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, దివ్యాంశ కౌశిక్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్ కీలక పాత్రలో నటించగా.. ఇక అనసూయ కూడా కీలకమైన పాత్రలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేక పోయినట్లు తెలుస్తోంది.

ఇక సందీప్ కిషన్ కొన్ని చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించి ఆకట్టుకున్నారు. అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు మరి ఓటిటిలో నైనా ఈ సినిమా మెప్పిస్తుందేమో చూడాలి మరి. కానీ విడుదలైన ఒకే నెలలోనే ఇలా ఓటీటి లో రావడంతో సందీప్ కిషన్ అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతున్నారు

Share post:

Latest