తారకరత్న మరణంపై లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్!!

నందమూరి తారక రత్న చాలా రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరికి కన్నుమూశాడు. మంచి మనసున్న తారకరత్న చాలా చిన్న వయసులో తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తారక్ లేడన్న వార్త విని చాలామంది షాక్‌కి గురయ్యారు. అతని మరణం తర్వాత చాలామంది సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. మహా శివరాత్రి పర్వదినాన తారకరత్న కన్నుమూశాడు కాబట్టి అతనికి ‘శివైక్యం’ లభించిందని పలువురు కామెంట్లు కూడా చేస్తున్నారు.

అయితే తారకరత్న మృతిపై సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య, వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి షాకింగ్ ఆరోపణలు చేశారు. జనవరి 27న యువగలం పాదయాత్ర ప్రారంభం అయిన రోజునే తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురయ్యాడని.. అప్పుడే బ్రెయిన్‌డెడ్‌ అయ్యాడని ఆమె ఆరోపణలు చేశారు. కుమారుడు నారా లోకేష్ పాదయాత్రకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు తారకరత్న మరణాన్ని దాచి పెట్టాడని ఆమె అన్నారు. పాదయాత్ర ప్రారంభించగానే తారకరత్న చనిపోయాడంటే అది తన కొడుకు పాదయాత్రకు చెడ్డ పేరు తీసుకొస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు ఇలా చేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు.

స్వార్థ రాజకీయాల కోసం చనిపోయిన తారకరత్నను ఇన్ని రోజులు ఆసుపత్రిలో ఉంచారని ఆమె ఆరోపించారు. కాగా, చంద్రబాబు నాయుడు పై లక్ష్మీ పార్వతి చేసిన విమర్శలకు మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు చంద్రబాబు వైపు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తే మరి కొందరు అతనికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులలో సంచలనంగా మారాయి. కాగా తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు.