బాబుకు కొడాలి చాలు..టీడీపీని లేపుతున్నారు!

టి‌డి‌పి అధినేత చంద్రబాబుని బూతులు తిట్టే నాయకులు ఎవరంటే..కొడాలి నాని పేరు ఠక్కున చెప్పవచ్చు. అసలు కొడాలి నాని తిట్టినట్లు చంద్రబాబుని మరెవరూ తిట్టరనే చెప్పాలి. ఈయన టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వెళ్ళిన దగ్గర నుంచి బాబుని గట్టిగా టార్గెట్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మరింత దారుణంగా తిడుతున్నారు. అయితే కొడాలి ఇలా తిడుతూ..బాబు ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తున్నామని అనుకుంటున్నట్లు ఉన్నారు.

అలాగే జగన్ వద్ద మార్కులు కొట్టేసే అంశంలో బాగా యూజ్ అవుతుందని బాబుని తిడుతున్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఇలా తిట్టడం వల్ల బాబుకు కొడాలి బెనిఫిట్ చేస్తున్నారనే చెప్పాలి. తాజాగా కూడా ఆయన..బాబు టార్గెట్ గా పరుష పదజాలంతో దూషించారు.   ఏ పోలీసుకైనా తిక్కరేగితే చంద్రబాబును కాల్చి పారేస్తాడు అని, నల్లమల అడవుల్లోకి చంద్రబాబు ఒక్కడే వస్తే.. తానూ, వల్లభనేని వంశీ అక్కడకు వస్తామని, ఒకవేళ తాను, వంశీ చంద్రబాబును కొట్టొస్తే.. ముసలాడు పైకి పోతాడని దారుణంగా మాట్లాడారు.

ఇలా నాని తనదైన శైలిలో చంద్రబాబుని ఎప్పుడూ తిడుతూనే  ఉన్నారు. రాజకీయ పరంగా విమర్శలు వస్తే కౌంటర్లు ఇవ్వడం చేయవచ్చు కానీ ఇలా తిట్టడం వల్ల బాబుని ప్రజలు నమ్మరు అని కొడాలి అనుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. కానీ ఆ పరిస్తితి కనిపించడం లేదు. నిజానికి కొడాలి అలా తిట్టి తిట్టి..బాబుపై ప్రజల్లో సానుభూతి పెరిగేలా చేశారని చెప్పవచ్చు.

కొంత బాబు బలాన్ని పెంచుతుంది కొడాలి అనే చెప్పాలి. ఇలా మాట్లాడటం వల్ల కొడాలికి వ్యక్తిగతంగా నష్టం పెద్దగా లేదేమో కానీ..వైసీపీకి పార్టీ పరంగా నష్టం జరిగేలా ఉంది. కాబట్టి ఈ తిట్లు కార్యక్రమం వల్ల బాబుకు పోయేదేమీ లేదు గాని..రివర్స్ లో వైసీపీకే డ్యామేజ్ జరిగేలా ఉంది.

Share post:

Latest