టీడీపీలోకి కన్నా..జనసేనలో అదే అడ్డంకి..సీటుపై క్లారిటీ!

ఎట్టకేలకు సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 23న ఆయన టి‌డి‌పిలో చేరతారని తెలిసింది. అయితే దశాబ్దాల పాటు ఆయన కాంగ్రెస్ లో పనిచేశారు. అయిదుసార్లు పెదకూరపాడు ఎమ్మెల్యేగా, ఒకసారి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ లో మంత్రిగా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడంతో ఆయన వైసీపీలోకి వెళ్లాలని చూశారు.

కానీ బి‌జే‌పి పెద్దలు కన్నాని వైసీపీలోకి వెళ్లనివ్వకుండా బి‌జే‌పిలోకి లాగారు. అలాగే ఏపీ బి‌జే‌పి అధ్యక్ష పదవి ఇచ్చారు. ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లారు. ఘోరంగా ఓడిపోయి ఒకశాతం ఓట్లు కూడా తెచ్చుకోలేదు. ఎన్నికల తర్వాత కొందరు టి‌డి‌పి నేతలని బి‌జే‌పిలో చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే అమరావతి కోసం పోరాటం చేశారు. అయితే అనూహ్యంగా ఆయన్ని తప్పించి సోము వీర్రాజుని అధ్యక్షుడుగా పెట్టారు. అప్పటినుంచి కన్నా బి‌జే‌పిలో యాక్టివ్ గా ఉండటం లేదు. పైగా సోము..కన్నా వర్గాన్ని సైడ్ చేస్తూ వచ్చింది. అమరావతి పోరాటాన్ని వదిలేశారు. జగన్‌కు అనుకూలంగా నడిచారు.

దీంతో కన్నా..సోముపై అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే బి‌జే‌పికి గుడ్ బై చెప్పేశారు. అయితే కన్నా..టి‌డి‌పి లేదా జనసేనలో చేరతారని ప్రచారం వచ్చింది. కానీ జనసేన ఆల్రెడీ బి‌జే‌పితో పొత్తులో ఉంది. దీంతో అనుచరులంతా కన్నాని టి‌డి‌పిలోకి వెళ్లాలని చెప్పారు. దీంతో కన్నా టి‌డి‌పిలో చేరడానికి రెడీ అయ్యారు. 23వ తేదీన టి‌డి‌పిలో చేరే అవకాశాలు ఉన్నాయి.

అలాగే కన్నాకు గుంటూరు వెస్ట్ సీటు బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. అయితే అక్కడ టి‌డి‌పి నుంచి ముగ్గురు, నలుగురు నేతలు పోటీ పడుతున్నారు. కానీ కన్నాకు అనుభవం ఉండటం..ఆల్రెడీ ఒకసారి అక్కడ గెలిచి ఉన్నారు. జనసేనతో పొత్తు ఉన్న ఆ సీటు టి‌డి‌పికే దక్కే ఛాన్స్ ఉంది. అందుకే కన్నాకు గుంటూరు వెస్ట్ సీటు ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది.