లోకేష్ పాదయాత్రతో టీడీపీ గ్రాఫ్ డౌన్..నిజమెంత?

లోకేష్ పాదయాత్రతో టీడీపీకి మైలేజ్ రావడం లేదా? ఇంకా టి‌డి‌పి గ్రాఫ్ డౌన్ అయిందా? అంటే వైసీపీ నేతల మాటల్లో మాత్రం టి‌డి‌పి గ్రాఫ్ డౌన్ అయిందనే చెప్పవచ్చు. పాదయాత్రపై మొదట నుంచి వైసీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసలు పాదయాత్రలో జనం లేరని, లోకేష్‌ని ప్రజలు పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సైతం..లోకేష్ పై విమర్శలు చేశారు.

నారా లోకేష్ పాదయాత్రతో టీడీపీ గ్రాఫ్ పడిపోతోందని, సీనియర్లు సైతం ఇప్పుడు తలపట్టుకుంటున్నారని, రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు, లోకేష్‌ లాంటివారిని శాశ్వతంగా రాజకీయం నుంచి దూరం చేయాలని సూచించారు. చంద్రబాబు, లోకేష్‌ వైఖరి రోజురోజుకూ దిగజారుతోందని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావడం కష్టమేనని జోస్యం చెప్పారు. అయితే ఇదంతా బైరెడ్డి వర్షన్..మరి నిజంగానే లోకేష్ పాదయాత్ర వల్ల టి‌డి‌పి గ్రాఫ్ పడిపోతుందా? అంటే అందులో ఏ మాత్రం నిజం లేదనే విశ్లేషకులు అంటున్నారు.

లోకేష్ పాదయాత్రకు రాష్ట్ర స్థాయిలో హైప్ రాలేదు గాని..లోకల్ గా లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు ఉందని తెలుస్తోంది. ఎక్కడ పాదయాత్ర చేస్తే ఆ నియోజకవర్గంలో పాదయాత్రకు ప్రజా స్పందన బాగానే ఉంది. అలాగే లోకేష్ మునుపటి కంటే మారారు. ప్రజలని ఆకర్షించేలా మాట్లాడుతున్నారు..వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అలా విమర్శలు చేయడం బట్టే వైసీపీ నేతలు కూడా లోకేష్‌ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు.

ఒకవేళ లోకేష్ పాదయాత్ర సక్సెస్ కాలేదు అనుకుంటే..అసలు ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం వైసీపీ నేతలకు ఉండదని అంటున్నారు. లోకేష్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారంటే..పాదయాత్ర విజయవంతం అయినట్లే అంటున్నారు.