కృష్ణాలో మాజీ మంత్రులు మళ్ళీ గట్టెక్కలేరా?

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలని జగన్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నారు. అయితే మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ పనిచేస్తున్న..అందుకు తగిన విధంగా కొందరు ఎమ్మెల్యేలు పనిచేయడం లేదు. పైగా వారిపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. అలాంటి వారితో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడం అనేది వైసీపీ పెద్ద పరీక్ష అని చెప్పవచ్చు.

పైగా టీడీపీ-జనసేన పొత్తు ఉంటే వైసీపీ డేంజర్ జోన్ లోకి వెళ్ళినట్లే. ఇక ఈ పొత్తు ప్రభావం వల్ల ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మాజీ మంత్రులు డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. మామూలుగానే ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. ఇంకా పొత్తు ఉంటే డేంజర్ జోన్ లో ఉన్నట్లే. మొదట విడతలో మంత్రులుగా పనిచేసి తర్వాత పదవులు కోల్పోయిన వారు పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్…ఈ ముగ్గురు మొదట విడతలో మంత్రులుగా చేశారు.

అయితే వీరికి తమ తమ స్థానాల్లో నెగిటివ్ కనిపిస్తుంది. మచిలీపట్నంలో పేర్ని నానికి పెద్ద పాజిటివ్ కనిపించడం లేదు. ఇక ఈయన నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా తన తనయుడు కృష్ణమూర్తిని నిలబెట్టాలని చూస్తున్నారు. ఎవరు నిలబడిన గాని గెలుపు కష్టమయ్యేలా ఉంది. అటు విజయవాడ వెస్ట్ లో వెల్లంపల్లి శ్రీనివాస్‌కు పాజిటివ్ కనిపించడం లేదు. పైగా పొత్తు ఉంటే వెల్లంపల్లి గెలవడం డౌటే. పొత్తులో భాగంగా వెస్ట్ సీటు జనసేనకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆ ఇద్దరి కంటే కొడాలి నాని పరిస్తితి మెరుగ్గానే ఉంది. కాకపోతే కొడాలి వైఖరి వల్ల పార్టీకి నష్టం జరిగిందని చెప్పవచ్చు. ఆ ప్రభావం గుడివాడలో కూడా ఉంది. కానీ టి‌డి‌పి బలపడకపోవడం నానికి అడ్వాంటేజ్. అయితే టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే గుడివాడలో కొడాలికి కాస్త కష్టమే అని చెప్పవచ్చు.