ఎన్నోసార్లు చావు అంచుల దాకా వెళ్ళా..విజయశాంతి..!!

స్టార్ హీరోలతో సినిమాలు చేసి లేడీస్ సూపర్ స్టార్ గా పేరుపొందింది విజయశాంతి. ఎన్నో సినిమాలు ముందుండి నడిపించిన ఈమె లేడీ అమితాబ్ గా కూడా బిరుదు పొందింది. ఒకపక్క గ్లామర్ హీరోయిన్ గా నటిస్తేనే కర్తవ్యం నుంచి ఒసేయ్ రాములమ్మ దాకా ఎన్నో లేడి ఓరియంటెడ్ చిత్రాలలో నటించింది. తాజాగా విజయశాంతి తన సినీ కెరియర్ గురించి మాట్లాడడం జరిగింది. విజయశాంతి మాట్లాడుతూ..180 సినిమాల దాకా నటించాను అన్ని భాషలలో కూడా నటించాను అందులో లేడి ఓరి అంటే చిత్రాలే నాకు ఎక్కువగా ఇష్టం అంటూ తెలియజేసింది.

Happy birthday Vijayashanthi: Did you know the first remuneration of the  lady superstar? | Telugu Movie News - Times of Indiaనా చిన్న వయసులోనే నాన్న గుండెపోటుతో మరణించారు. ఆ భేంగతోనే అమ్మ కూడా మంచాన పడిపోయింది.కొనేళ్లకే తన తల్లి కూడా చనిపోయిందని ఆ తర్వాత నేను ఎవరి మీద ఆధారపడకుండా బతికాను తన పెళ్లి కూడా నేనే చేసుకున్నాను తన ఫస్ట్ రేమ్యునరేషన్.. రూ.5 వేల రూపాయలు ఇచ్చారు. కానీ అందులో కొంత ఎగ్గొట్టి రూ.3వెలు ఇవ్వడం జరిగింది అంటూ తెలిపింది విజయశాంతి. ఇక తరువాత కోటి రూపాయలు తీసుకొని స్థాయికి వెళ్లాను ఆ కాలంలో ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న టాప్ త్రీ సినీ తారలలో రజనీకాంత్, అమితాబ్ తో పాటు నేను కూడా ఉన్నానని తెలిపింది.

చాలాసార్లు నేను చచ్చి బతికాను ఒకేసారి విమాన ప్రమాదం మరొకసారి నీళ్లల్లో కొట్టుకుపోయాను ఇంకొకసారి మంటల్లో చిక్కుకున్నాను మరొకసారి ట్రైన్ నుంచి కింద పడిపోయాను ఇంత జరిగిన కూడా బతికి పోయాను అంటూ తెలియజేసింది విజయశాంతి. ఇక అలా తన సినీ కెరియర్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలిపింది విజయశాంతి.

Share post:

Latest