ధనుష్ సార్ మూవీ ఎలా ఉందంటే..?

కోలీవుడ్ హీరో ధనుష్ మొదటిసారిగా తెలుగులో నటించిన చిత్రం సార్. ఈ సినిమాని డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించింది. ఈ సినిమా తెలుగు,తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ,టీజర్స్ ,ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ రోజున ఈ సినిమా గ్రాండ్గా విడుదలవ్వడం జరిగింది.

Sir Review, Sir 2023 Telugu Movie Review, Vaathi Review
ముందుగానే ఈ సినిమా ప్రీమియం షోలు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రీమియర్ షో చూస్తున్న అభిమానులు ట్విట్టర్ వేదికగా ఈ సినిమా గురించి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా విద్యాసంస్థలు ఎలా వ్యాపారంగా మారింది చదువుని అడ్డుపెట్టుకొని ప్రజల బలహీనతలతో ఆడుకుంటున్న కొంతమంది వ్యాపారవేత్తలు ఎలా కోట్లు సంపాదించుకుంటున్నారు అనే అంశంపై డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒకవైపు కామెడీ తోనే ఆకట్టుకుంటూనే మరొకవైపు ప్రేక్షకుల్ని ఆలోచింపచేసే విధంగా ఉందన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ధనుష్ నటనకు అయితే మంచి మార్కులే పడ్డాయని తెలుస్తోంది. ఎమోషనల్తో కట్టి పడే సన్నివేశాలలో కూడా బెస్ట్ పెర్ఫార్మషన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇక సార్ సినిమా చూసిన ఒక నేటిజన్ ఫస్ట్ అఫ్ యావరేజ్ గా ఉంది. సెకండ్ హాఫ్ మరింత బాగుంది ఇందులోని చాలా సన్నివేశాలు మంచి హైప్ నీ తీసుకొచ్చాయి అని తెలిపారు. మరొక నేటిజన్ ఈ సినిమా కమర్షియల్గా అద్భుతంగా హార్ట్ టచింగ్ ఎమోషనల్ గా సాగిపోతోంది అంటూ తెలిపారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్లోగానే ఉన్నప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం అని కామెంట్స్ చేస్తున్నారు.

సార్ చిత్రం మంచి మెసేజ్ తో సాగిపోయేలా ఉందని మరికొంతమంది నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కథలో కొన్ని డల్ మూమెంట్స్ ఊహించగలిగే విధంగా ఉండడం మైనస్ అని మరొక నేటిజన్ ట్విట్ చేశారు. ఓవరాల్ గా సార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

Share post:

Latest