చేజేతులారా సక్సెస్ సినిమాలను వదులుకున్న హీరోయిన్స్..!!

సాధారణంగా ఇండస్ట్రీలో ఒకరు చేయవలసిన సినిమాలు మరొకరు చేస్తూ ఉంటారు. ఆలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఫ్లాప్ సినిమాలు అందుకున్న వారు చాలామంది ఉన్నారు. అయితే ఒక హీరోయిన్ చేయవలసిన సినిమా ఆమె పలు కారణాల చేత తప్పుకోవడంతో మరొక హీరోయిన్ చేసి హిట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు మిస్ చేసుకున్న కొన్ని క్రేజీ ప్రాజెక్టుల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం.

ముందుగా హీరోయిన్ రాసి ఖన్నా, విజయ్ దేవరకొండ తో గీత గోవిందం సినిమాలో నటించాల్సి ఉండగా డేట్స్ లో అడ్జస్ట్ కాలేకపోవడంతో రష్మి కానీ ఎంపిక చేయడం. అలాగే f-2 సినిమాలో తమన్నా పాత్రలో నటించాల్సి ఉండగా ఎందుకు ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట.

ఇక సమంత, రామ్ చరణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం రంగస్థలం. ఈ సినిమాలో ముందుగా అనుపమని హీరోయిన్గా తీసుకోవాలనుకున్నారట. కానీ ఈ పాత్రకు అనుపమ సెట్ కాదని ఫైనల్ గా సమంత ను ఎంపిక చేయడం జరిగింది. ఇక బాహుబలిలో తమన్నా పాత్రకు సోనం కపూర్ ని తీసుకోవాలని ఎందుకు ఆమె ఈ పాత్రకు ఒప్పుకోలేదు.

ఇక మరొక హీరోయిన్ శృతిహాసన్ కూడా నాని నటించిన జెర్సీ సినిమాలో నటించాల్సి ఉండగా నటించలేకపోయింది. దీంతో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. అలాగే మహేష్ బాబు కాజల్ అగర్వాల్ నటించిన బిజినెస్ మాన్ చిత్రంలో కూడా శృతిహాసన్ నటించిన సర్దుబాటు చేయలేక ఒప్పుకోలేకపోయింది.

ఇక అర్జున్ రెడ్డిలో ప్రీతి పాత్ర కోసం శాలిని పాండే కంటే ముందుగా మలయాళం నటి పార్వతి నాయర్ను
సంప్రదించగా ఆమె బోల్డ్ పాత్ర కావడంతో కాస్త వెనుకడుగు వేసిందట. అలాగే కుమారి 21ఎఫ్ చిత్రానికి హెబ్బా పటేల్ కంటే ముందు చాందిని చౌదరిని అనుకోగా ఆమె బోల్డ్ పాత్ర కావడంతో ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట.ఇలా ఇంత మంది హీరోయిన్ సక్సెస్ సినిమాలని రిజెక్ట్ చేశారు.

Share post:

Latest