గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్ సంఘవి..!!

రవితేజ నటించిన సింధూరం చిత్రంలో నటించింది హీరోయిన్ సంఘవి. ఈ సినిమాలో ఈమె అందానికి అమాయకత్వానికి రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలు ఫిదా అయిపోయారని చెప్పవచ్చు. హీరోయిన్ సంఘవి కర్ణాటకలోని మైసూరు ప్రాంతానికి చెందిన అమ్మాయి. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 1993 నుంచి 2004 మధ్యకాలంలో దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్గా చలామణి అయ్యింది. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించింది సంఘవి. దాదాపుగా 15 ఏళ్ల సినీ కెరియర్ల 80 కు పైగా చిత్రాలలో నటించి మెప్పించింది సంఘవి.

Actress Sanghavi Family Photos with Daughter, Husband💖~90's Ajith & Vijay Heroin Sanghavi Biography - YouTube
తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషలలో కూడా నటించి అలరించింది. 1990వ దశకంలో హోమ్లీ హీరోయిన్ గా పేరు సంపాదించిన సంఘవి సింధూరం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తాజ్ మహల్, నాయుడు గారి కుటుంబం, సమరసింహారెడ్డి, సూర్యవంశం, ప్రేయసిరావే, లాహిరి లాహిరిలో తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. కాస్త ఆలస్యంగా ఈమె 38 ఏళ్ల వయసులో వివాహం చేసుకుంది 2016లో బెంగళూరుకు చెందిన వెంకటేష్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 42 ఏళ్ల వయసులో ఒక పండంటి పాపకు జన్మనిచ్చింది సంఘవి.

Gokulathil Seethai | Chennai Television

చాలా మంది ఈ మధ్యకాలంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు.. ఇక సంఘవి కూడా అలానే మొదలు పెట్టింది జబర్దస్త్ అంటే కొన్ని బుల్లితెర షోల పైన జడ్జ్ గా వ్యవహరించింది.అలాగే ఆలీతో సరదాగా వంటి టాక్ షోలో కూడా పాల్గొనింది అయితే ఎందుకో కానీ ఆ తర్వాత వెండితెరపై బుల్లితెర పైన అసలు కనిపించలేదు సోషల్ మీడియాలో ప్రస్తుతం తన కుటుంబాలతో ఉన్నటువంటి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇటీవల మీనా సంఘవి ఇద్దరు కలిసి ఉండేటువంటి ఫోటోలను షేర్ చేసింది. ఇద్దరు కూడా ఒకేసారి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం.

Share post:

Latest