యంగ్ ప్రొడ్యూసర్‌తో కుర్ర హీరోయిన్ అఫైర్.. ఇండస్ట్రీలో ఒకటే టాకు??

రెండు దశాబ్దాలుగా సినిమా డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారంలో ఉన్న ఓ యంగ్ ప్రొడ్యూసర్, నిర్మాణంలో తనదైన ముద్ర వేయాలని బాగా కష్టపడుతున్నాడు. అతను సినిమాలతో తన సమయాన్ని వెచ్చిస్తున్నాడు. క్వాలిటీ కంటెంట్‌పై ఎక్కువ దృష్టి పెడతాడు. ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ బ్యాక్‌డ్రాప్‌తో ఓ భారీ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నాడు.

ఈ సినిమా హీరోయిన్ హోమ్లీ లుక్స్‌తో తెలుగు వారికి బాగా దగ్గరయ్యింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు 100% సక్సెస్ రేటు ఉంది. ఇప్పటివరకు నటించింది కొన్ని సినిమాలే అయినా మెల్లగా బిజీ అవుతోంది. కాగా ఆ యువ నిర్మాత, ఈ హీరో మధ్య ఆఫైర్ మొదలైందని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. వారి రిలేషన్ ఎలా ప్రారంభమైందో తెలియదు కానీ వారు ఇప్పుడు పీకల్లోతు రొమాన్స్‌లో మునిగి తేలుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ తారకు తెలుగు ప్రేక్షకులలో మంచి ఇమేజ్‌ ఉంది. అలాంటిది ఇలా ఆమె అఫైర్ పెట్టుకుందని రూమర్స్ రావడం చూసి షాక్ అవుతున్నారు.

ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, వారి మధ్య రొమాన్స్ చాలా ఎక్కువవుతుంది. సినిమా షూటింగ్‌కి సంబంధించి హీరోయిన్ హైదరాబాద్‌లో ఉన్నప్పుడల్లా దాదాపు ప్రతిరోజూ వీరు కలుస్తారట. నిజానికి నిర్మాత-హీరోయిన్ సంబంధాలు ఇండస్ట్రీకి కొత్తేమీ కాదు కానీ వీరిది ఎక్కడ ముగుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే వీరిద్దరూ ఎవరై ఉంటారా అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ యువ ప్రొడ్యూసర్ల లిస్టు చూస్తున్నారు. మరి కొందరు హోమ్ లుక్స్ ఉన్న హీరోయిన్ ఎవరా అని ఆలోచిస్తున్నారు.

Share post:

Latest