HBD: బ్రహ్మానందం ఆస్తి విలువ ఎన్ని కోట్ల తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హాస్యనటుడుగా ఒక వెలుగు వెలిగిన బ్రహ్మానందం ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ కొన్ని వందలకు పైగా సినిమాలలో నటించారు. ఇక తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు బ్రహ్మానందం. ఇటీవల పలు ఆనారోగ్య సమస్యల వల్ల బ్రహ్మానందం ఎక్కువగా సినిమాలలో నటించలేకపోతున్నారు. అయినప్పటికీ అడపాదడపా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉన్నారు.

HBD Brahmanandam: బ్రహ్మీ.. ది లాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. ఆయన మాత్రమే సాధించిన  అరుదైన రికార్డులు ఇవే.. | Happy birthday Brahmanandam do you know His  Created unique records by great legendary ...

ఈరోజు బ్రహ్మానందం 67వ పుట్టినరోజు సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు వైరల్ గా మారుతున్నాయి. బ్రహ్మానందం మొదట లెక్చరర్ గా విధులు నిర్వహిస్తూ ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా ఆహనా పెళ్ళంట సినిమాలో బ్రహ్మానందం కామెడీ ఆ సినిమాకు హైలైట్ గా నిలిచింది.. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హీట్ కావడంతో ఆ తర్వాత నుండి కామెడీ పాత్రలకు వరుస అవకాశాలు వెల్లుపడ్డాయి. బ్రహ్మానందం కామెడీ ప్రేక్షకులు అలవాటు పడ్డారు. ఇప్పటికీ తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటే కామెడీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.

ఇదంతా ఇలా ఉండగా సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ కమెడియన్గా గుర్తింపు పొందిన బ్రహ్మానందం.. రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నది. ఒకానొక సందర్భంలో ఒక్కోచిత్రానికి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారు. ఇలా ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ గా గుర్తింపు పొందిన బ్రహ్మానందం.. తన పారితోషకంలో సగభాగం భూముల పైన ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇక తర్వాత ఆయన చేసిన పొదుపు స్థిర ఆస్తుల కలిపితే దాదాపుగా రూ.600 కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తుంటాయి. బ్రహ్మానందం డబ్బు విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఉంటారు.