తన ఫస్ట్ లవ్ బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చిన హన్సిక..!!

అల్లు అర్జున్ దేశ ముదురు సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది హీరోయిన్ హన్సిక. ఆ తర్వాత ఎంతోమంది హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ పలు బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది ఇక పలు చిత్రాలలో కూడా స్పెషల్ సాగులో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఓటీటి లో కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఒకవైపు సినిమాలు మరొకవైపు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంటున్నా ఈ ముద్దుగుమ్మ గత ఏడాది తన స్నేహితుడు సోహేల్న వివాహం చేసుకుంది.

Simbu - Hansika's new still goes viral - Tamil News - IndiaGlitz.com

ఇక అందుకు సంబంధించి ఒక వీడియోను కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది. ఇటీవల ఒక ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన హన్సిక తన మొదటి ప్రేమ బ్రేకప్ గురించి ఆ తర్వాత సోహెల్ తో పరిచయం గురించి పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరుగుతోంది. గతంలో హన్సిక హీరో శింబుతో ప్రేమలో ఉందంటూ వార్తలు వినిపించాయి అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే వీరు విడిపోవడం కూడా జరిగింది. హన్సిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫస్ట్ లవ్ బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది తనకు చాలా సంవత్సరాలు ఆ ప్రేమను మర్చిపోవడానికి పట్టిందని తెలియజేసింది.

బ్రేకప్ తర్వాత కోలుకొని కొత్త వ్యక్తి ప్రేమను అంగీకరించడానికి దాదాపుగా 8 సంవత్సరాలు పట్టింది. నాకు ప్రేమపై నమ్మకం ఉంది కానీ రొమాంటిక్ వ్యక్తిని కాదు రొమాంటిక్ పర్సనల్గా చాలా ఎక్స్ప్రెసివ్ కాదు.. మనసులోని భావనలను త్వరగా బయట పెట్టలేను నేను వివాహ వ్యవస్థను నమ్ముతాను ప్రేమను నమ్ముతాను. తను చేసుకోబోయే వ్యక్తి గురించి నిర్ణయం తీసుకునేందుకు చాలా సమయం పట్టింది అలా సోహెల్ను ప్రేమించి వివాహం చేసుకున్నానని తెలిపింది హన్సిక.

Share post:

Latest