వీడియో: గీతా మాధురిపై ఎస్.ఎస్ తమన్ సూపర్బ్ పంచ్!

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎక్కువగా ట్యూన్స్ కొట్టేసాడనే కాంట్రవర్సీలలో నిలుస్తుంటాడు. చాలామంది అతడిని ట్రోల్ చేస్తుంటారు కూడా. అయితే ఇప్పుడు మాత్రం వేరే కారణంతో అతడు నెటిజన్లలో హాట్ టాపిక్ గా మారాడు. అందుకు కారణం అతను గీతామాధురిపై కొంటె కామెంట్స్ చేయడమేనని స్పష్టం అవుతుంది. తమన్ ఆహా ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2’కి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో లాంచ్ ఈవెంట్ నెల్లూరులో జరిగింది. ఈవెంట్లో తమ గీతామాధురి పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సీజన్ 2లో తమన్‌తో సహా గీత మాధురి, కార్తీక్ జడ్జిలుగా పనిచేయనున్నారు. హేమచంద్ర హోస్ట్ గా ఎంపికయ్యాడు. అయితే లాంచ్ ఈవెంట్‌లో గీత మాధురి, తమన్ మధ్య ఒక ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ సంభాషణలో ఒక యాంకర్ మాట్లాడుతూ “తమన్ గీతా మాధురిని ఉద్దేశించి ఆమె స్క్రీన్ పై ఉంటే చాలు ప్రేక్షకులు తెరకే అతుక్కుపోతారు అని అన్నారు. అది నిజమే” అని అన్నది. దాంతో గీతా మాధురి మాట్లాడుతూ “తమన్ సర్‌ది మంచి మనసు. మంచి కళ్ళకు అన్నీ మంచిగానే కనిపిస్తాయి. అందుకే ఆయన మంచిగా మాట్లాడుతారు” అంటూ చెప్పింది.

అలా గీతా మాధురి పొగుడుతుంటే ఆమె వైపు చూడకుండా కెమెరా వైపు ఇంకా దిక్కులు చూస్తున్నాడు. దాంతో సార్ నేను మీ గురించే మాట్లాడుతున్నాను మీరు ఎటు చూస్తున్నారు అని నవ్వుతూ అంటుంది. దానికి బదిలిస్తూ తమన్ “కెమెరా వైపే చూడాలి కదా, నీ వైపు చూస్తే వాళ్లు తప్పుగా అనుకుంటారు” అని పంచ్ వేశాడు. దాంతో నవ్వడం అందరూ వంతు అయింది.

Share post:

Latest