తండ్రి క‌న్నా బాలయ్య‌నే ఎక్కువ‌గా ప్రేమించిన‌ తార‌క‌రత్న‌.. అందుకు ఈ టాటూ నిద‌ర్శ‌నం!

నంద‌మూరి తార‌క‌ర‌త్న తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయారు. గుండెపోటుతో ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న‌.. 23 రోజులు మృత్యువుతో పోరాడి శ‌నివారం రాత్రి తుది శ్వాస విడిచారు. కోలుకొని ఆరోగ్యంగా తిరిగివస్తాడని అనుకున్నా.. తార‌క‌ర‌త్న‌ను మృత్యువు కబళించ‌డంతో కుటుంస‌భ్యులు, అభిమానులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో ఆయ‌న‌ అంత్యక్రియలు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌స్తుతం ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు తార‌క‌ర‌త్న‌కు నివాళులు అర్పిస్తున్నారు.

మ‌రోవైపు తార‌క‌ర‌త్న‌కు సంబంధించి ఎన్నో విష‌యాలు తెర‌పైకి వ‌స్తున్నారు. తార‌క‌ర‌త్న‌కు బాబాయ్ బాల‌కృష్ణ అంటే ఎనలేనంత ప్రేమ. అటు బాల‌య్య కూడా తార‌క‌ర‌త్న‌ను ఎంత‌గానో ప్రేమించేవారు. ఆ ప్రేమ కారణంగానే హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులు అబ్బాయ్‌ దగ్గరే ఉండి అన్నీ తానై చూసుకున్నారు బాలయ్య‌. అక్కడే ఉంటు తారకరత్నకు మెరుగైన వైద్యం అందించేందుకు చాలా తాపత్రయపడ్డారు. అటు డాక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. కానీ ఫలితం లేకుండా పోయింది.

ఇక అబ్బాయికి కూడా బాబాయ్ అంటే ప్రేమ మరియు అభిమానం. ఇంకా చెప్పాలంటే త‌న తండ్రి క‌న్నా బాల‌య్య‌నే తార‌క‌ర‌త్న ఎక్కువ‌గా ప్రేమించాడు. అందుకు ఆయ‌న చేతిపై ఉన్నా టాటూనే నిద‌ర్శ‌నం. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో బాబాయ్‌ సిగ్నేచర్‌ను ఒంటిపై టాటూగా వేయించుకున్నారు తారకరత్న. బాల‌య్య అంటే ఒక సింహం లాంటి మనిషి. కాబట్టి సింహం బొమ్మ మ‌రియు దాని కింద బాబాయ్ సంతకాన్ని టాటూగా వేయించుకున్నాడు. అంటే బాల‌య్య అంటే తార‌క‌ర‌త్న‌కు ఎంతో ప్రేమో అర్థం చేసుకోవ‌చ్చు.

Share post:

Latest