రామ్ చరణ్ కు మొదటిసారి ఉపాసన ఎక్కడ పరిచయమైందో తెలుసా..?

మెగా దంపతులు రామ్ చరణ్, ఉపాసనల మధ్య అన్యోన్యత గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. టాలీవుడ్లో ఆదర్శ దంపతులుగా కూడా పేరుపొందారు. వీరిద్దరి ప్రేమకు కానుకగా త్వరలోనే ఒక బేబీ కూడా రాబోతోంది ఇద్దరు వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమ వ్యక్తిగత స్పేస్ లో కూడా అంతే సంతోషంగా ఉంటారు. ఇక రామ్ చరణ్ కు సంబంధించి అన్ని విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఉపాసన చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తూ ఉంటుంది.

Ram Charan and Upasana are expecting their first child, announces  Chiranjeevi - Hindustan Times
ఒకసారి ఈ దంపతులు ఫాస్ట్ లైఫ్ లోకి వెళ్తే ఇద్దరూ ప్రేమించి కూడా పెద్దల్ని ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు. కాలేజ్ డేస్ నుంచి ఇద్దరు మధ్య స్నేహం ఉండేదట. ఆ తర్వాత కాలంలో అది ప్రేమగా మారి వివాహం వరకు దారితీసిందని తెలుస్తోంది.ఇంతవరకు అందరికీ తెలిసిన విషయమే.. ఆ తర్వాత మళ్లీ వీరి పరిచయం ఎలా జరిగింది తొలి సమావేశం ఎక్కడ జరిగింది అన్న విషయం పైన పెద్ద కథ ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదట ఇద్దరికీ అసలు పరిచయం లేదట. ఇద్దరి కామన్ స్నేహితుల ద్వారా వీరిద్దరి పరిచయం జరిగినట్లు సమాచారం.

ఇద్దరి కాలేజీలు ఒకటే అయినప్పటికీ వీరిద్దరి మధ్య మొదటి సమావేశం లండన్ లో స్పోర్ట్స్ క్లబ్లో జరిగినట్లు తెలుస్తోంది.అక్కడే వీరిద్దరు స్నేహితులుగా మారి తొలి ప్రయాణం మొదలయ్యిందట. అటుపై ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఈ విషయాన్ని ఇరువురు పెద్దలకు తెలియజేస్తూ ఒకటయ్యారు. అయితే ఇరువూరు కుటుంబాలు ముందే ఒకరికొకరు బాగా తెలియడంతో పెళ్లి విషయంలో కూడా ఎవరు అడ్డు చెప్పలేదట. అలా రామ్ చరణ్ ,ఉపాసన నిశ్చితార్థం డిసెంబర్ 1 -2011న చేసుకున్నారు. ఇక 2012 జూన్ 14న గ్రాండ్గా వివాహం చేసుకున్నారు.

Share post:

Latest