ఎన్టీఆర్ గురించి చివరిసారిగా తారకరత్న ఏం మాట్లాడారో తెలుసా..?

నటుడు నందమూరి తారకరాత్మ మరణించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ విషయంతో సినీ పరిశ్రమలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి గడిచిన 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రుల చికిత్స పొందుతూ శివరాత్రి రోజు మరణించారు. తారకరత్న ఆయన మరణం పై సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇక ఇప్పటికే ఎంతోమంది ప్రముకులు సెలబ్రెటీల సైతం తారకరత్న పార్థివ దేహానికీ నివాళులర్పించారు. తారకరత్న తో తమకున్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకోవడం జరిగింది.

Nandamuri Taraka Ratna Passes Away: Jr NTR and Kalyanram reach his Mokila  residence to pay their last respects | PINKVILLA
ఈ రోజున మూడు గంటల తర్వాత మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే తారకరత్నకు సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ కొన్ని మాటలు వైరల్ కావడంతో ఈ మాటలు విన్న నందమూరి అభిమానులు కన్నీరు పెట్టుకున్నారు. పదవి ఏముంది పార్టీయే మాది ఎప్పటికీ ప్రజల కోసమే మా పోరాటం పోరాడుతూనే ఉంటాము.. సామాన్యుడిగా పోరాడాను నాయకుడిగా కూడా పోరాడతాను.. ఎన్టీఆర్ నా తమ్ముడే కదా జూనియర్ ఎన్టీఆర్ ని వేరుగా చూడడం అనేది ఎప్పటికీ ఉండదని తారకరత్న ఎన్టీఆర్ గురించి చివరిగా మాట్లాడిన మాటలు అన్నట్లుగా తెలుస్తోంది.

అయితే తమ మీద వచ్చేటువంటి పుకార్లను అసలు నమ్మనని నందమూరి బిడ్డ.. నందమూరి రక్తం నా తమ్ముడు ఎన్టీఆర్ ఎప్పటికీ నా తమ్ముడే అన్నకి తమ్ముడు పై ఎంత ఆప్యాయత ఉంటుందో అంతే ఆప్యాయత నాకు ఉంటుంది అంటూ తెలియజేసినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది. కొద్దిరోజుల క్రితం టిడిపి పార్టీలో చేరి.. యువ గళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకి గురయ్యారు. ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రిలోకి తరలించగా పరిస్థితి విషమించడంతో బెంగళూరులో మరణించారు.

Share post:

Latest